Begin typing your search above and press return to search.

నిత్య ప్రాణం కోసం నాని

By:  Tupaki Desk   |   23 July 2018 5:49 AM GMT
నిత్య ప్రాణం కోసం నాని
X
ఒక పక్క సినిమాలతో పాటు బిగ్ బాస్ 2 తో యమా బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ నాని తనకు అవకాశం ఉన్నపుడు మంచి సినిమాలకు చేయూతనిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే నిత్య మీనన్ కీలక పాత్ర పోషిస్తున్న ప్రాణ అనే సినిమాలో క్యామియోకు ఒప్పుకున్నాడు. తెలుగు-తమిళ్-కన్నడ-మలయాళం నాలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ప్రాణలో నాని మాత్రమే చేయగలిగే ఓ పాత్ర ఉందట. అందుకోసం దర్శకుడు వికె ప్రకాష్ సంప్రదించినప్పుడు ఎక్కువ సేపు ఆలోచించకుండా ఎస్ చెప్పినట్టు తెలిసింది. నాని పాత్ర ఎంత సేపు ఉంటుంది లాంటి వివరాలు బయటికి రాలేదు కానీ చాలా కీలకమైన పాత్ర కాబట్టే ఇంత బిజీ షెడ్యూల్ లోనూ నాని ఓకే చెప్పుంటాడు అనే టాక్ అయితే ఉంది. నాని ఫస్ట్ బిగ్ బ్రేక్ అలా మొదలైంది సినిమా హీరోయిన్ నిత్య మీననే . బహుశా ఆ బాండింగ్ కూడా పనిచేసి ఉండొచ్చు. ఇటీవలే విడుదలైన ప్రాణ ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల నుంచి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లుక్ లోనే ఇందులో వెరైటీ కాన్సెప్ట్ ఉందనేలా ప్రొజెక్ట్ చేయటం ప్లస్ అవుతోంది.

ప్రాణలో ఇవి కాకుండా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ ఇందులో హీరో కానీ హీరో లాంటి కీలక పాత్ర చేస్తున్నాడు. టాప్ టెక్నీషియన్స్ గా గొప్ప పేరున్న పిసి శ్రీరామ్-రసూల్ పూకుట్టి లాంటి వాళ్ళు ప్రాణ టీమ్ లో ఉన్నారు. ఎస్ రాజ్ ప్రొడక్షన్స్ రియల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రాణ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా టాక్ ఉంది. ఈ సినిమా కోసమే వేరే వాటికి సైన్ చేయకుండా నిత్య మీనన్ దీని మీదే సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఆ మధ్య నాని నిర్మించిన ఆ!లో ఎవరూ ఊహించని ఒక టిపికల్ పాత్ర ద్వారా మెప్పించిన నిత్యా మీనన్ గ్లామర్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసి తనకు ఛాలెంజ్ గా అనిపించే వాటినే ఏరికోరి మరీ ఎంచుకుంటోంది. ప్రాణ కూడా అదే సిరీస్ లో వస్తున్నట్టు పోస్టర్ ద్వారానే తెలిసిపోతుంది. తన మొహం చుట్టూ అల్లుకుపోయిన కొన్ని పదుల సంఖ్యలో ఉన్న బొమ్మ మొహాల మధ్య ఏదో చెప్పాలని ట్రై చేస్తున్న నిత్య మీనన్ మనసులో మాట తెలియాలంటే ప్రాణ వచ్చే దాకా ఆగాల్సిందే.