Begin typing your search above and press return to search.
గద్దలకొండ సక్సెస్ తో నాని ఫ్యాన్స్ రిలాక్స్
By: Tupaki Desk | 25 Sep 2019 1:30 AM GMTవరుణ్ తేజ్ విలన్ గా నటించిన 'గద్దలకొండ గణేష్' చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ చూస్తుంటే వరుణ్ తేజ్ కు హిట్ పడ్డట్లే అనిపిస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ జిగర్తాండ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రంను రూపొందించాడు. వరుణ్ తేజ్ ను విలన్ గా చూస్తారా అంటూ ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేశాడు. నటుడిగా నిరూపించుకోవాలంటే విలన్ గా నటించాలని వరుణ్ తేజ్ మరోసారి ప్రూవ్ చేశాడు. వరుణ్ తేజ్ విలన్ గా గద్దలకొండ గణేష్ చిత్రంలో మెప్పించిన కారణంగా ఇప్పుడు నాని ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను.. క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూ వస్తున్న నాని 'వి' చిత్రం కోసం విలన్ గా మారబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తనను హీరోగా పరిచయం చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటి చిత్రంతోనే విలన్ గా కూడా నాని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నానికి ఇది 25వ చిత్రం అవ్వడం కూడా ప్రత్యేకమైన విషయం. నానికి ఉన్న ఇమేజ్ కు విలన్ పాత్ర చేయడం ఏంటంటూ అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ ఆయన నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో విలన్ గా నటించాలనే నిర్ణయం తీసుకోవడం అవివేకం అనుకున్నారు.
ఎప్పుడైతే 'గద్దలకొండ గణేష్' చిత్రంలో వరుణ్ తేజ్ విలన్ గా మెప్పించాడో.. సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయో అప్పటి నుండి నాని ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. నాని తన నటనతో విలన్ గా కూడా అదరగొడతాడని.. ఇప్పుడు హీరోలు విలన్స్ గా చేసినా కూడా ప్రేక్షకులు ఒప్పుకుంటున్నారని నాని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. నానికి ఇదో బెంచ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకానికి వచ్చారు.
గతంలో చిరంజీవి.. బాలకృష్ణ వంటి స్టార్స్ నెగటివ్ ఛాయలు ఉన్న పాత్రలు చేస్తే ఆ సినిమాలను ప్రేక్షకులు తిరష్కరించిన సందర్బాలు ఉన్నాయి. అందుకే అప్పటి నుండి స్టార్ హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు చేయాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన తీరు మారింది కనుక యంగ్ హీరోలు రౌడీ వేషాలు వేసేందుకు సిద్దం అవుతున్నారు. నాని 'వి'లో విలన్ గా సక్సెస్ అయితే మరిన్ని సినిమాల్లో హీరోలు విలన్స్ గా నటించే అవకాశాలు ఉన్నాయి.