Begin typing your search above and press return to search.
చరణ్ ట్రెండ్ ఫాలో అవుతున్న నాని
By: Tupaki Desk | 23 Jun 2018 5:37 AM GMTగడిచిన ఈ ఐదేళ్లల్లో టాలీవుడ్ చాలా అభివృద్ధి చెందిందని చెప్పాలి. మార్కెట్ పరంగానే కాకుండా ప్రయోగాలు అద్భుతాలు చేయడంలో మన సినిమా వాళ్ళు చాలా రాటు దేలారు. విమర్శలు ఎన్ని ఉన్నా కూడా తెలుగు సినిమాలు బలే ఉంటాయని నార్త్ జనాలు యూట్యూబ్ లకు అతుక్కుపోయి మరి సినిమాలను చూసేస్తున్నారు. ఇక కథల పరంగా మన స్టార్స్ చాలా మార్పులు చేసుకుంటున్నారు.
స్టార్ హోదాను పక్కనపెట్టి నటనకోసం ప్రాణం పెట్టేస్తున్నారు. అలాగే గతంలో జరిగినట్టుగా వింటేజ్ బ్యాక్ స్టోరిలకు కూడా హీరోలు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇటీవల రంగస్థలం సినిమా 1990 కాలం కథగా తెరకెక్కి ఏ స్థాయిలో విజయాన్నీ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 120 కోట్ల షేర్స్ ని అందింది ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులు కూడా చాలా వరకు విలేజ్ అండ్ పాత కాలం వాతావరనాన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మిగతా హీరోలు కూడా 1990 బ్యాక్ డ్రాప్ కథలను ఎక్కువగా లైక్ చేస్తున్నారు.
ఇటీవల శర్వానంద్ 1990 కాలంలో నడిచే విరాట పర్వం 1992 అనే కథను ఒకే చేశాడు. ఇక అదే తరహాలో నాని కూడా ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు. అసలే మనోడు రొటీన్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే సడన్ గా స్పోర్ట్స్ మ్యాన్ అవతారం ఎత్తాడు. ఇటీవల ఒకే చేసిన జెర్సీ అనే ప్రాజెక్టు 1990 కాలంలోనే నడుస్తుంది. నాని ఒక క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. 1986 నుంచి 1996 వరకు నడిచే ఆ కథను మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నాడు. మరి రామ్ చరణ్ సెట్ చేసిన ఈ ట్రెండ్ లో ఈ హీరోలు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.