Begin typing your search above and press return to search.

నాని 8పేజీల డైలాగ్స్‌ సింగిల్‌ టేక్‌లో!

By:  Tupaki Desk   |   25 May 2015 9:30 AM GMT
నాని 8పేజీల డైలాగ్స్‌ సింగిల్‌ టేక్‌లో!
X
యువ కథానాయకుడు నాని టాలెంట్‌ ఏంటో ఇదివరకు ఆయన చేసిన సినిమాలే నిరూపించాయి. ఇంటెన్షన్‌తో కూడిన పాత్రల్ని భలే చేస్తుంటాడు నాని. కామెడీ పండించడంలోనూ మనోడికి తిరుగులేదు. సహాయ దర్శకుడిగా చేసిన అనుభవమో లేక నటన విషయంలో రాటుదేలాడో ఏంటో కానీ... నాని నటన విమర్శకుల్ని సైతం మెప్పిస్తోంది.

ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగల దిట్టగా ఆయనకు పేరుంది. నానిని దృష్టిలో ఉంచుకొని కథ రాసుకొంటే ఏ కథానాయకుడితోనైనా సినిమా చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా నాని నటనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాలో 8 పేజీల డైలాగ్స్‌ని ఏకధాటిగా సింగిల్‌ టేక్‌లో చెప్పేశాడట. భావోద్వేగాలతో కూడిన ఆ డైలాగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఆ చిత్రబృందం చెబుతోంది. నిర్మాత అల్లు అరవింద్‌కి కూడా ఆ సన్నివేశం భలే నచ్చిందట. దాని గురించి స్వయంగా చెప్పుకొచ్చారు నాని. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకొన్నట్టు సమాచారం.