Begin typing your search above and press return to search.
జెంటిల్మన్ డీలా పడ్డాడా? బోల్తా కొట్టాడా?
By: Tupaki Desk | 22 Jun 2016 5:36 AM GMTఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో.. అష్టాచెమ్మా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మన్ చిత్రం గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో పాటు మౌత్ టాక్ కూడా బాగానే ఉండడంతో వీకెండ్స్ ముగిసేవరకూ ఈ సినిమా పెర్ఫామెన్స్ అదరగొట్టింది. కానీ ఒక మూవీ నిజమైన సత్తా తెలిసేది సోమవారం కలెక్షన్స్ ప్రకారమే.
ఆ లెక్కన చూస్తే మండే నుంచి కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఎంతగా ప్రచారం చేసుకున్నా.. సోమవారం నాటికి లెక్కలు మారిపోయాయి. భలే భలే మగాడివోయ్ చిత్రంతో చేసిన మ్యాజిక్ ఇక్కడ కనిపించలేదు. నానికి స్ట్రాంగ్ ఏరియా అయిన ఓవర్సీస్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడైతే ఆదివారం నాటికే కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. శనివారం నాడు 2,02,412 డాలర్లను వసూలు చేసిన జెంటిల్మన్.. ఆదివారం నాటికి 1,21,089 డాలర్లకు పడిపోవడం ఆశ్చర్యకరం. అప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ దాటినా.. సోమవారం నుంచి ఈ లెక్కలు మరీ తగ్గిపోయాయి.
ఇప్పటికీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అ..ఆ.. చిత్రం స్ట్రాంగ్ గానే ఉంది. మూడో వారాంతం తర్వాత కూడా అ..ఆ.. నిలబడ్డం చూస్తుంటే.. దీని రికార్డులు మరిన్ని నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే.. జెంటిల్మన్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం.. రెండో వారాంతానికే ఫైనల్ రన్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఓవర్సీస్ తో పోల్చితే లోకల్ గా పరిస్థితి కొంచెం బెటర్ అనే చెప్పాలి.