Begin typing your search above and press return to search.
నాని సినిమానే నెంబర్ వన్
By: Tupaki Desk | 3 July 2016 11:30 AM GMTఎంత పాజిటివ్ టాక్ వచ్చినా.. ఎంత పెద్ద సినిమా అయినా.. ఫస్ట్ వీకెండ్ అవ్వగానే జోరు తగ్గిపోతుంది. రెండో వీకెండ్ కలెక్షన్లు బాగున్నా తర్వాతి వారానికి మాత్రం బాక్సాఫీస్ రేసులో నిలబడ్డం కష్టమే. అందులోనూ కొత్త సినిమాల పోటీ మధ్య కలెక్షన్లు పడిపోకుండా చూసుకోవడం చాలా కష్టమైపోతున్న రోజులివి. ఐతే నాని కొత్త సినిమా ‘జెంటిల్ మన్’ మాత్రం మూడో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర హవా సాగిస్తోంది. జెంటిల్ మన్ గత నెల 17న రిలీజైంది. టాక్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లలో మేజర్ డ్రాప్ కనిపించింది. పైగా తర్వాతి రెండు వారాల్లో మూడేసి చొప్పున సినిమాలు రిలీజయ్యాయి. దీంతో నాని సినిమా కథ తొలి వారంతో ముగిసిపోతుందని.. ఆ సినిమా బయ్యర్లు నష్టాల బాట పట్టడం ఖాయమని అంచనా వేశారంతా.
కానీ ‘జెంటిల్ మన్’ రెండో వారాంతం కూడా మంచి వసూళ్లు సాధించడమే కాదు.. మూడో వారంలోనూ హవా సాగిస్తోంది. ఈ వీకెండ్లో నాని సినిమానే బాక్సాఫీస్ నెంబర్ వన్ గా నిలుస్తోంది. ‘రోజులు మారాయి’ - ‘ది లెజెండ్ ఆఫ్ టార్జాన్’ ఓ మోస్తరు వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ‘జెంటిల్ మన్’ కలెక్షన్లే దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ‘ఎ’ సెంటర్లలో ‘జెంటిల్ మన్’ జోరు కనిపిస్తోంది. ఈ వీకెండ్ మల్టీప్లెక్సుల్లో అత్యధిక బుకింగ్స్ నాని సినిమాకే ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.17-18 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు అంచనా. ఫుల్ రన్లో రూ.20 కోట్ల మార్కు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత డ్రాప్ చూస్తే ఈ సినిమా రూ.15 కోట్ల మార్కు టచ్ చేయడం కూడా చాలా కష్టంలాగే అనిపించింది.