Begin typing your search above and press return to search.
లక్ష డాలర్లు అడుగుతున్న నాని
By: Tupaki Desk | 7 July 2016 5:30 PM GMT‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో అమెరికాలో పెద్ద స్టార్ అయిపోయాడు నాని. ఆ సినిమా ఏకంగా 1.45 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆ స్థాయిలో కాకపోయినా.. 8 లక్షల డాలర్ల దాకా వసూలు చేసి నాని స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ఈ మధ్యే వచ్చిన ‘జెంటిల్ మన్’ కూడా నానికి అమెరికాలో మంచి ఫలితాన్నే ఇచ్చింది. ‘జెంటిల్ మన్’ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో తొలి వారాంతం తర్వాత ఉన్నట్లుండి పడిపోయినా సరే.. అమెరికాలో మాత్రం స్టడీగా సాగాయి. తర్వాతి వారాల్లో సరైన సినిమా పడకపోవడంతో ‘జెంటిల్ మన్’ నిలకడగా వసూళ్లు సాధించింది.
ఇప్పటిదాకా ‘జెంటిల్ మన్’ అమెరికాలో 9 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇంకో లక్ష డాలర్లు వస్తే మిలియన్ క్లబ్ రీచ్ అవుతుంది. ఐతే మూడు వారాల ప్రదర్శన పూర్తయ్యాక ఇంకో లక్ష డాలర్లు వసూలు చేయడమంటే అంత సులువేమీ కాదు. అయినప్పటికీ ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఈ వారం నోటబుల్ రిలీజ్ ‘అంతం’ మాత్రమే. అది అమెరికాలో అసలు విడుదలే కాలేదు. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు ఎప్పుడో జోరు తగ్గించేశాయి. తర్వాతి వారం కూడా పెద్ద రిలీజులేమీ లేవు. 22న కబాలి వచ్చేవరకు నానికి ఎదురు లేనట్లే. కాబట్టి ఎలాగోలా మిలియన్ క్లబ్బును టచ్ చేసేయొచ్చేమో. ఇప్పటికే నానికి అమెరికాలో రెండు మిలియన్ డాలర్ మూవీస్ ఉన్నప్పటికీ.. అందులో ‘ఈగ’ నాని క్రెడిట్లోకి రాదు. ‘భలే భలే మగాడివోయ్’ ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయముంది. ‘జెంటిల్ మన్’ మిలియన్ క్లబ్బులోకి వెళ్తే మాత్రం దాని క్రెడిట్ పూర్తిగా నానికే దక్కుతుంది. మరి ఈ సినిమా ఆ ఘనత సాధిస్తుందో లేదో చూడాలి.
కాబట్టి నాని సినిమాకు అసలు పోటీనే లేనట్లే.