Begin typing your search above and press return to search.
అక్కడ మాత్రం నాని పెద్ద స్టారేనబ్బా..
By: Tupaki Desk | 13 Jun 2016 11:30 AM GMT‘భలే భలే మగాడివోయ్’ సినిమా టైటిల్స్ లో నాని పేరుకు ముందు ‘నేచురల్ స్టార్’ అని సరదాకే వేశారేమో కానీ.. ఆ సినిమా తర్వాత నాని నిజంగానే స్టార్ అయిపోయాడు. అతడి తర్వాతి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు వచ్చిన హైప్.. జరిగిన బిజినెసే అందుకు నిదర్శనం. సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేదు కానీ.. అమెరికాలో మాత్రం నాని రేంజే వేరని రుజువు చేసింది. దాదాపు మిలియన్ డాలర్ వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పుడు ‘జెంటిల్ మన్’ సినిమా మీద కూడా యుఎస్ లో మంచి హైప్ కనిపిస్తోంది. ఈ సినిమాను అమెరికాలో ఏకంగా 125 థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం.
స్టార్ హీరోల్లో కూడా అందరికీ 100 పైగా స్క్రీన్లు ఇవ్వరు అమెరికాలో. అక్కడ బిజినెస్ స్ట్రాటజీనే వేరుగా ఉంటుంది. మాస్ హీరోల కంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే ఎంటర్టైనర్స్ అందించే హీరోలకే క్రేజ్ ఎక్కువ. నాని ఆ కేటగిరీలోకే వస్తాడు. ‘భలే భలే..’ అక్కడ 1.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అది ఫ్లూక్ హిట్ అనుకోవడానికేమీ లేదని.. నాని సినిమాలకు నిజంగానే అక్కడ మంచి క్రేజ్ ఉందని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ రుజువు చేసింది. ఈ నేపథ్యంలో ‘జెంటిల్ మన్’ మీద కూడా అక్కడి బయ్యర్ భరోసాతో ఉన్నాడు. జనాల్లో కూడా సినిమా మీద మంచి నమ్మకాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఈజీగా మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేస్తుందని అంచనా.