Begin typing your search above and press return to search.

అబ్బబ్బా.. మెగాస్టార్ సైకిల్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   14 April 2017 11:35 AM GMT
అబ్బబ్బా.. మెగాస్టార్ సైకిల్ ఇచ్చేశారు
X
హీరో నాని తాను మెగాస్టార్ సినిమాల కోసం ఎలా చెవులు కోసుకునేవాడో.. చిన్నప్పుడు ఒకసారి సత్యం ధియేటర్లో సినిమా చూడ్డానికి వెళితే తన సైకిల్ ఎలా పోయిందో.. అయినాకూడా సినిమా చూసేసే ఇంటికి వెళ్ళిన వైనం మనోడు ఈ మధ్యనే ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' షోలో చెప్పుకొచ్చాడు. అదంతా చెబుతూ.. మీరు నాకు ఒక సైకిల్ బాకీ సార్ అంటూ తెలియజెప్పాడు. అందుకు మెగాస్టార్ కూడా స్పందించారండోయ్.

#MegastarForAReason అనే హ్యాష్‌ ట్యాగ్ తో ఇప్పుడు హీరో నాని కొత్త విషయం రివీల్ చేశాడు. ''అప్పుడు సైకిల్ పోగొట్టుకున్న పిల్లాడికి ఇప్పుడు సైకిల్ తిరిగొచ్చింది. షోలో ప్రామిస్ చేసినట్లు ఇప్పుడు చిరంజీవి గారు నిజంగానే నాకు సైకిల్ పంపేశారు. మెగాస్టార్ ఫర్ ఏ రీజన్!!'' అంటూ ట్వీట్ వేసి అసలు విషయం బయటపెట్టాడు నాని. ఈ కుర్ర హీరోకు మెగాస్టార్ ఇప్పుడు సైకిల్ గిఫ్ట్ గా పంపేశారట.

ప్రస్తుతం ''నిన్ను కోరి'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న నాని.. ఇప్పుడు చిరంజీవి సైకిల్ గిఫ్ట్ ఇచ్చారని చాలా ఆనందపడుతున్నాడు. అదే విధంగా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కు వచ్చిన సెలబ్రిటీ అతిథుల కోరికలు తీరుస్తున్నందుకు.. మెగాస్టార్ కూడా ఫుల్ హ్యాపీ!!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/