Begin typing your search above and press return to search.
సుక్కూ అసిస్టెంట్ కి నాని తో ఛాన్స్
By: Tupaki Desk | 15 Nov 2019 6:58 AM GMTనేచురల్ స్టార్ నాని పంథా మార్చినట్లు కనిపిస్తోంది. సీనియర్ల కంటే కొత్త కుర్రాళ్లే బెటర్ అని భావిస్తున్నాడని అర్థమవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన అనుభవాన్ని తెలివి గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. సీనియర్లతో ఎదురైన పరాజయాల నేపథ్యం లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నేచురల్ స్టార్ ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ మూవీ 25 వ చిత్రం `వీ`లో నటిస్తున్నాడు. ఈ చిత్రాని కి తనని హీరో గా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓ వైపు గురువు ఇంద్రగంటి తో కెరీర్ 25వ సినిమా చేస్తూనే తదుపరి వరుస గా డెబ్యూ దర్శకుల కు నానీ అవకాశాలిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సక్సెస్ తప్పనిసరి అయిన టైమ్ లో నాని గేమ్ ప్లాన్ ఏమిటో అన్న చర్చ సాగుతోంది. ఇకపై నాని రిస్క్ తీసుకోకుండా తనకు బాగా నమ్మకస్తులకే ఛాన్సిస్తుచ్చాడు. అష్టాచెమ్మా- జెంటిల్ మెన్ లాంటి మైల్ రాయి చిత్రాల్ని అందించిన ఇంద్రగంటితో కాన్ఫిడెంట్ గా ముందుకెళుతున్నాడు. దీంతో పాటే తదుపరి ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టి వరుసగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలిస్తుండడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. నాని 26- నాని 27 చిత్రాలకు దర్శకులు ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
మహేష్ అనే కొత్త కుర్రాడు వినిపించిన స్క్రిప్ట్ ను నాని ఒకే చెప్పాడని ఇటీవల ప్రచారమైంది. ఇంత లోనే శ్రీకాంత్ అనే మరో కొత్త కుర్రాడి ని దర్శకుడి గా పరిచయం చేయనున్నాడని సమాచారం. శ్రీకాంత్ వినిపించిన స్టోరీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుట. అతడు స్టార్ డైరెక్టర్ సుకుమర్ వద్ద అసోసియేట్ దర్శకుడి గా పని చేశారు. వెర్సటైల్ డైరెక్టర్ శిష్యుడి గా శ్రీకాంత్ అదిరిపోయే కథ వినిపించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్లు సమాచారం.