Begin typing your search above and press return to search.
'గ్యాంగ్ లీడర్' టైటిల్ వివాదంపై వివరణ
By: Tupaki Desk | 7 Sep 2019 10:04 AM GMTనేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా `నాని`స్ గ్యాంగ్ లీడర్` ఈనెల 13న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ చాలాకాలంగా వివాదాల్లో ఉంది. ఇదే టైటిల్ తో వేరొకరు సినిమా ప్రారంభించడంతో నాని-విక్రమ్ టీమ్ ఆ టైటిల్ ని తమ వద్ద నుంచి లాక్కున్నారని అటువైపు నిర్మాతలు వాపోయారు. ఈ టైటిల్ వివాదం గురించి నానీని ప్రశ్నిస్తే.. నాని అన్నది ముందు చేర్చి పరిష్కారం ఆలోచించామని తెలిపారు. హైదరాబాద్ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో నాని పైవిధంగా స్పందించారు.
గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ సెలెక్షన్ విక్రమ్ దే. ఐతే ఈ టైటిల్ పై కొన్ని వివాదాలు.. భిన్న వాదనలు తెరపైకి రావడం వల్లనే మేం `నానిస్ గ్యాంగ్ లీడర్` అని మార్చుకున్నాం. నా దృష్టిలో ఈ టైటిల్ ఈ కథకు చక్కగా సరిపోతుంది. సినిమా చూశాక మీరే ఆ సంగతి చెబుతారు అని అన్నారు. గ్యాంగ్ లీడర్ మూవీ ఎలా మొదలైంది? అన్న ప్రశ్నకు.. జెర్సీ టైమ్ లోనే విక్రమ్ తనకు కొన్ని కథలు వినిపించారని.. అందులో గ్యాంగ్ లీడర్ కథ బాగా నచ్చిందని చెప్పడంతో సెట్స్ పైకి వెళ్లామని తెలిపారు.
విక్రమ్ స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నకు.. గ్యాంగ్ లీడర్ చిత్రంలో కొన్ని ఆసక్తికర మలుపులు ఉన్నా.. స్క్రీన్ ప్లే మరీ అంత అర్థంకానంత క్లిష్టంగా ఉండదు. విక్రమ్ ఈ చిత్రాన్ని అందరికి అర్థమయ్యేలా సింపుల్ గా వినోదాత్మకంగా తెరకెక్కించారని తెలిపారు. గ్యాంగ్ లీడర్ కథ కొత్తగా ఉంటుంది. రివేంజ్ డ్రామాని హాస్యంతో వినూత్నంగా తెరకెక్కించారు. ఐదుగురు ఆడవాళ్ళు .. ప్రతి ఒక్కరి కథ ఏమిటి అన్నది ఆసక్తికరంగా చూపించారు. నేను గ్యాంగ్ లీడర్ చిత్రానికి అంగీకరించడానికి కారణమదేనని తెలిపారు.