Begin typing your search above and press return to search.
తనీష్ కు అడ్వాంటేజ్ ఇచ్చిన నాని..
By: Tupaki Desk | 24 Sep 2018 6:08 AM GMTబిగ్ బాస్ ఫైనల్ కు చేరింది. ఆదివారం రాత్రి ఉత్కంఠ భరితంగా మొదలైన ఎపిసోడ్ లో మొదట అగ్రహీరో నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. నాని-నాగార్జున కలిసి నటించిన ‘దేవదాస్’ మూవీ ఈ నెల 27న విడుదలువుతున్న సంగతి తెలిసిందే.. దీని ప్రమోషన్ కు బిగ్ బాస్ ను వాడేశారు. హీరోయిన్లు కూడా సందడి చేశారు. ఈ బిట్ అయిపోగానే ఫైనల్ కు చేరిన కంటెస్టెంట్లను ప్రచారం చేసుకోమ్మని నాని పిలుపునిచ్చాడు. వ్యూహాత్మకంగా కౌశల్ నుంచి మొదలుపెట్టాడు. అయితే అది మిగతా కంటెస్టెంట్లకు ఆయాచిత వరమైంది. ముఖ్యంగా తనీష్ ను లాస్ట్ చెప్పమని నాని అతడికి కావాల్సినంత టైంను.. ఆలోచించుకోవడానికి వెసులుబాటును కల్పించారు. అంతేకాదు అందరూ చెప్పాక అదంతా విని బేరీజు వేసుకొని చెప్పడానికి ఆస్కారం కల్పించాడు.
కౌశల్ తనకు మొదటి చాన్స్ రాగానే రెచ్చిపోయాడు. ఇంటిసభ్యులంతా తనను టార్గెట్ చేసి ఎంత హింసిస్తున్నారో తెలిపేలా ‘వేటగాడు-పులి’ స్టోరీని రంగరించి చెప్పేశాడు. అయితే ఇక్కడే కౌశల్ పెద్ద పొరపాటు చేశాడు. కౌశల్ ఆ స్టోరీ చెప్పాక చివర్లో మిగతా ఇంటిసభ్యుల గురించి నోరుజారాడు. అదే అతడికి మైనస్ గా మారింది. తాను మాత్రమే గొప్ప.. మిగతా వారు వేస్ట్ అంటూ వారి లోపాలు ఎత్తిచూపాడు. ఇదే అతడి వైఖరిని తేటతెల్లం చేసింది. ఓరకంగా కౌశల్ ను ప్రజల్లో చులకన చేసిందని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
క్యాంపెయినింగ్ లో అందరూ చెప్పాక తనీష్ కు చివరన నాని అవకాశమిచ్చాడు. దీంతో వారు వారు స్లిప్ అయిన మాటలన్నీ జాగ్రత్త పడి తనీష్ తనదైన శైలిలో అమ్మ సెంటిమెంట్ చెప్పి.. తానింతే.. ఇలానే ఉంటా.. ప్రేమ - అనుబంధాల కోసం ఏమైనా చేస్తా.. ఇతరులను నిందించి తాను గెలవనంటూ కౌశల్ కు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడి అందరి మనసు గెలుచుకున్నారు. నిజానికి లాస్ట్ చెప్పమని చెప్పి తనీష్ కు ఓ రకంగా నాని ఫేవర్ చేశాడనే విమర్శలు వచ్చాయి. మొదట చెప్పిన కౌశల్ నోరుజారి ప్రేక్షకుల్లో మైనస్ అయిపోతే లాస్ట్ చెప్పి తనీష్ లాభపడ్డాడని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.