Begin typing your search above and press return to search.

నానికిష్టమైన అల్కహాల్ బ్రాండ్ ఇదే!

By:  Tupaki Desk   |   28 Sep 2018 8:37 AM GMT
నానికిష్టమైన అల్కహాల్ బ్రాండ్ ఇదే!
X
ఇక పాత కాలంలో మందు సీన్లు విలన్లకు విలన్ గ్యాంగు కు ఎక్కువగా పెట్టేవారు. పోను పోను కామెడీ కోసం మందు సీన్స్ డిజైన్ చెయ్యడం మొదలు పెట్టారు.. ఇక అందులో హీరో గ్యాంగ్ కూడా ఉండేది. ఇప్పుడు కాలం మారి విలన్ - హీరో అనే తేడాల్లేకుండా పోయాయి. ఇక రియల్ లైఫ్ విషయం మాట్లాడుకుంటే మందు కొట్టడంలో ఆడవారు కూడా మెమేమీ వెనకబడడం లేదని 'డ్రంక్ & డ్రైవ్' చెకింగులప్పుడు నిరుపిస్తూనే ఉన్నారు. ఇంత ఓపెన్ అయిన విషయం కాబట్టి హీరోలు కూడా లిక్కర్ టాక్ మొదలుపెట్టారు.

నాగార్జున ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో బీరు కొట్టేవాడినని గతంలో వెల్లడించారు. తాజాగా 'దేవాదాస్' ప్రమోషన్స్ లో భాగంగా 'రా' నే తాగుతానని అందులో నీళ్ళు సోడా కలపడం ఇష్టం ఉండదని శెలవిచ్చి షాక్ ఇచ్చారు. ఇక అదే 'దేవదాస్' ప్రమోషన్స్ లో భాగంగా న్యాచురల్ స్టార్ నాని తనకిష్టమైన మందు ఏదో వెల్లడించాడు. నానికి వైన్ ఫేవరెట్ డ్రింక్ అట.. ఓన్లీ రెడ్ వైన్. 'దేవదాస్' లో నాగ్-నాని కలిసి మందేసే సీన్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుతూ సెట్స్ లో నాగ్ సార్ తాగడం చూడలేదన్నాడు. తను మాత్రం ఒక తాగుడు సీన్ కోసం కాస్త రెడ్ వైన్ పుచ్చుకున్నాడట. సినిమా పూర్తయిన తర్వాత మాత్రం డైరెక్టర్ తో కలిసి ఒక 'సిట్టింగ్' వేసినట్టు చెప్పాడు.

ఇక నాగార్జున సార్ సెట్ లో తన డ్రింక్ గురించి ఎందుకు అలా చెప్పాడో తెలియదన్నాడు. అంతే కాదు సెట్స్ లో నాగ్ సార్ ఉండడం వల్ల ఎవరూ డ్రింక్ చేసే ధైర్యం చేయలేదన్నాడు, ఏదేమైనా దేవదాసులు ఇద్దరూ లిక్కర్ టాక్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారు. ఇక మిగతా హీరోలను.. హీరోయిన్లను ఫేవరేట్ బ్రాండ్స్ ఏంటి అని అడగడం.. వాళ్ళు టీచర్స్ అని బ్లాక్ లేబుల్ అని గ్లెన్ ఫిడిచ్ అని ఓపెన్ గా చెప్పడం ఎంతో దూరంలో లేదు.