Begin typing your search above and press return to search.

ఏకంగా డైరక్ట్‌ చేసేద్దాం అనుకున్నా -నాని

By:  Tupaki Desk   |   13 April 2015 4:33 AM GMT
ఏకంగా డైరక్ట్‌ చేసేద్దాం అనుకున్నా -నాని
X
ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో విజయం అందుకుని తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు నాని. ఈ విజయం అతడికి మరోసారి కిక్‌ స్టార్ట్‌నిచ్చింది. కెరీర్‌లో పునరుజ్జీవాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలోనే నాని చాలా సంగతులే ముచ్చటించాడు.

=నా రెండు సినిమాలు ఒకేసారి రిలీజై చక్కని విజయాలు అందించాయి. చాలా సంతోషంగా ఉంది. జెండా పైకపిరాజు చిత్రానికి ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. ఎవడే సుబ్రహ్మణ్యం డీసెంట్‌ హిట్‌ కొట్టింది. సరైన టైమ్‌లో ఈ విజయాలు. చాలా సంతోషంగా ఉంది.

=సహాయ దర్శకుడి నుంచి హీరోగా మారాక ఆరు సంవత్సరాల వరకూ ఎలాంటి సినిమాల్లో నటించాలో అర్థం కాలేదు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నవాటికి ప్రాధాన్యతనిచ్చాను. రెండిటినీ బ్యాలెన్స్‌ చేయడానికే ప్రయత్నించా.

=ఎవడే సుబ్రహ్మణ్యం కంటే ముందు 70-80 స్క్రిప్టులు విన్నా. ఏవీ నచ్చేవి కాదు. ఎలాంటి స్క్రిప్టు ఎంచుకోవాలో అర్థం కాలేదు. చివరికి నేనే డైరెక్ట్‌ చేస్తే అని ఆలోచించాను. కానీ నా స్నేహితులు ఆ ప్రయత్నం విరమించుకునేలా చేశారు. ఇది సరైన టైమ్‌ కాదని ఉద్భోధ చేశారు. వాళ్లకు నా ధన్యవాదాలు.

=ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగు కోసం హిమాలయాలకు వెళ్లాం. అప్పుడు అర్థమైంది అసలు విషయం. అసలు ఈ జీవితం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అప్పటికి ఏం చేయాలో అది చేయాలి అని తెలుసుకున్నా. కొండల్లో బతకడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. ఆలూ కూర్మాలు అన్నిసార్లు దొరకవు. ఉప్మాతోనే సరిపెట్టుకోవాల్సిన సందర్భం అక్కడ ఎదురైంది.

= నా సినిమాలు రిలీజ్‌ కానప్పుడు వాటి ప్రభావం నా మూడ్‌పై ఉండేది. వాటి కోసం చాలా ఆలోచించేవాడిని. రిలీజ్‌ కోసం తీవ్రంగా శ్రమించాల్సొచ్చింది. అలాంటప్పుడు ఒత్తిడి నుంచి నన్ను బైటపడేయడానికి తను ఎంతో ప్రయత్నించింది. ఒత్తిడి నుంచి నన్ను వేరు చేయడానికి తను ఇబ్బందిపడేది.