Begin typing your search above and press return to search.

నానీపై భామలు చెప్పిన నానీలు

By:  Tupaki Desk   |   2 July 2017 9:45 AM GMT
నానీపై భామలు చెప్పిన నానీలు
X
యంగ్ హీరో నాని ఇప్పుడు నేచురల్ స్టార్ అయిపోయాడు. రీసెంట్ గా ఓ ఫ్యాన్ ట్వీట్ కి రియాక్ట్ అయ్యి విమర్శలకు గురయ్యాడు కానీ.. నాని ని అందరూ తెగ ఇష్టపడిపోతుంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. నానితో కలిసి నటించిన హీరోయిన్స్ అయితే.. ఈ హీరో గురించి చెప్పమంటే ఎంతో సంబరంగా కబుర్లు చెప్పేస్తుంటారు.

నివేదా థామస్: యాక్టింగ్ లో కమల్ హాసన్ తర్వాత నానినే అనిపించేస్తుంది నాకు. వీరిద్దరూ నటనలో అంతగా లీనమైపోతూ ఉంటారు.

అను ఇమాన్యుయేల్: నాని గురించి చెప్పాలంటే అంతా మంచే గుర్తొస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు నాని నుంచి చాలా నేర్చుకోవాలి.

లావణ్యా త్రిపాఠి: కథలు ఎంచుకోవడంలో నాని టేస్ట్ సూపర్. నాని ఓకే చేశాడంటే ఆ స్టోరీలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.

కీర్తి సురేష్: నానికి అస్సలు విసుగురాదు.. ఓపికెక్కువ. ఎన్ని అడిగినా.. ఏం చెప్పినా ఓపికగా ఉంటాడు. అందుకా నాని మంచి కో యాక్టర్.

నిత్యా మీనన్: నానితో పని చేస్తుంటే సొంత కుటుంబంతో ఉన్నట్లే ఉంటుంది. తను నాకు మంచి ఫ్రెండ్. ఇప్పటికీ నా మూవీ ఫంక్షన్స్ కు వస్తాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/