Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ : నాని ఇమేజ్ కు పెద్ద డ్యామేజ్
By: Tupaki Desk | 18 Sep 2018 1:30 AM GMTతెలుగులో బిగ్ బాస్ అనగానే ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చారు. హిందీలో 10 సంవత్సరాలకు పైగా ప్రసారం అవుతున్న షో తెలుగులో ప్రసారం కాబోతుంది అనగానే బుల్లి తెర ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి సంతోషం రెట్టింపు చేసేలా మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకు వచ్చారు. నిర్వాహకులు భావించినట్లుగానే మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ రెండవ సీజన్ ప్రసారం అవుతుంది. రెండవ సీజన్ కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నానిని రంగంలోకి దించారు.
నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నాని - ఇతర హీరోల అభిమానులతో కూడా అభిమానింపబడ్డాడు. ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి - మెల్ల మెల్లగా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షో తన క్రేజ్ ను రెట్టింపు చేస్తుందని నాని భావించి ఆఫర్ రావడమే ఆలస్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బిగ్ బాస్ కమిట్ అవ్వడం నాని కెరీర్లోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ ఇప్పుడు ఆయన అభిమానులు అనుకుంటున్నారు.
సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న కారణంగా బిగ్ బాస్ ఎపిసోడ్స్ నాని చూస్తున్నట్లుగా లేడు. దాంతో వారాంతంలో షో నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం హోస్టింగ్ చేసేస్తున్నాడు. షోను నాని చూడక పోవడం వల్ల ఇంట్లో వారి ప్రవర్తనను సొంతంగా విశ్లేషించడం కష్టం అవుతుంది. అలాంటి సమయంలో రైటర్లు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేయాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల నాని ప్రేక్షకుల్లో బ్యాడ్ అవుతున్నాడు. నాని సొంతంగా ఆలోచించుకుని తన ఆలోచనకు తగ్గట్లుగా ఇంటి సభ్యులను ప్రశ్నించడం - ఇంటి సభ్యులను టార్గెట్ చేయడం వంటి చేస్తే బాగుండేది. కాని నాని రైటర్లు రాసిచ్చింది చదువుతున్న కారణంగా ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.
కొన్నిసార్లు నాని బిగ్ బాస్ నిర్వాహకుల వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కౌశళ్ ఆర్మీ ఎప్పటికప్పుడు నానిని టార్గెట్ చేస్తూనే ఉంది. నాని బిగ్ బాస్ కు హోస్ట్ గా అన్ ఫిట్ అంటూ ఆమద్య ఒక హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది అంటే కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో - నాని ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ అయ్యిందో చెప్పుకోవచ్చు. కౌశల్ ను అభిమానిస్తున్న జనాలతో పాటు, సామాన్యులు కూడా నాని పై ఒకింత అసహనంతో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ తో తన స్టార్ డంను పెంచుకోవాలని భావించిన నానికి అంతకు మించిన డ్యామేజీ అయ్యిందని సోషల్ మీడియా టాక్.