Begin typing your search above and press return to search.

ఎలక్షన్ మూడ్ లో నాని.. దీంతో పూర్తి!

By:  Tupaki Desk   |   19 Dec 2022 5:54 AM GMT
ఎలక్షన్ మూడ్ లో నాని.. దీంతో పూర్తి!
X
నాని ప్రస్తుతం ఎలక్షన్‌ మూడ్ లో ఉన్నాడంటూ సమాచారం అందుతోంది. ఆయన హీరోగా నటిస్తున్న దసరా సినిమా షూటింగ్ లో భాగంగా ఎలక్షన్‌ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సింగరేణి మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే అధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

ఆ మైక్స్ లో రెండు గ్రూప్ ల మధ్య కార్మిక సంఘం యొక్క ఎన్నికలు జరుగుతాయట. అందుకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పుడు జరుగుతుందని తెలుస్తోంది. దసరా సినిమా లో నాని ని చాలా కొత్తగా చూడబోతున్నాం అని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోలను చూస్తూ ఉంటే క్లారిటీ వచ్చేస్తోంది.

సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఎన్నికల సిత్రాలు చూడటం చాలా తక్కువ అయ్యింది. ఈసారి దసరా సినిమాలో ఆ సన్నివేశాలను చూడబోతున్నాం. పాత సినిమాల్లో ఎక్కువగా ఎన్నికలకు సంబంధించిన సన్నివేశాలు ఉండేవి. కానీ ఇప్పుడు సినిమాల పంథా మారింది. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సన్నివేశాలను దసరా లో చూపించే అవకాశం ఉంది.

నాని దసరా సినిమా పై చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. సినిమా కోసం నాని చాలా కాలంగా గడ్డం మరియు జుట్టు పెంచుకుని ఉన్నాడు. ఆ గడ్డం మరియు జుట్టు లో ఆయన్ను చూస్తూ ఉంటే అభిమానులకు దసరా ఎలా ఉంటుందా అనే ఆసక్తి కలుగుతుందట.

నాని తాజాగా హిట్‌ 2 తో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక కచ్చితంగా నాని దసరా తో హీరోగా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.