Begin typing your search above and press return to search.

అయ్యో.. చిట్టిని మ్యాచ్ చేయడానికి నాని తిప్పలు..!

By:  Tupaki Desk   |   30 Oct 2022 5:20 AM GMT
అయ్యో.. చిట్టిని మ్యాచ్ చేయడానికి నాని తిప్పలు..!
X
హీరో హీరోయిన్ జోడీ బాగుంటేనే స్క్రీన్ మీద వారి రొమాన్స్ చూడటానికి బాగుంటుంది. కొన్ని కాంబోలు కావాలని సెట్ చేసినా అవి పెద్దగా మెప్పించవు. ముఖ్యంగా మంచి హైట్ వెయిట్ ఉన్న హీరోయిన్స్ కి అలాంటి కటౌట్ ఉన్న హీరోలే పర్ఫెక్ట్. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ హైట్ విషయంలో పెద్దగా డిస్కషన్స్ లోకి రారు. కానీ కొత్తగా వచ్చిన హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా మాత్రం ఆ విషయంలో చర్చల్లో ఉంటుంది. దాదాపు అమ్మడు 6 ఫీట్ హైట్ ఉంటుందని తెలుస్తుంది.

జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో సూపర్ అనిపించుకున్న ఫరియా అబ్ధుల్లా లేటెస్ట్ గా సంతోశ్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా జోవియల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్ లో భాగంగా ఫరియా పక్కన నిలబడ్డ నాని ఆమెతో హైట్ మ్యాచ్ చేసుకోవాలని చూశారు. అసలే అయ్యప్ప మాలలో ఉన్న నాని కింద షూస్ కూడా లేకపోవడంతో ఆమె పక్కన తక్కువ హైట్ తో కనిపించారు.

కెమెరాలు క్లిక్ అనిపిస్తున్న టైం లో నాని కావాలని అరికాళ్లను పైకెత్తి చిట్టిని మ్యాచ్ చేయాలని చూశారు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆమెతో సినిమా చేయాల్సి వస్తే ఎలా అనుకున్నడో ఏమో కానీ ఈ ఈవెంట్ లో నాని చేసిన ఈ చిలిపి పని కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇంకేముందు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. నాని తన స్పీచ్ లో కూడా ఫరియా పక్కన నేను తక్కువ హైట్ తో కనిపించానని కూడా చెప్పాడు. ఏది ఏమైనా సరే ఒక హీరోయిన్ హైట్ మ్యాచ్ చేసుకోవడానికి నాని చేసిన ప్రయత్నం ఆడియన్స్ ని అలరిస్తుంది. నాని ప్రస్తుతం దసరా సినిమా చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా గుబురు గెడ్డంతో అదే లుక్ తో కనిపిస్తున్నారు. ఆ సినిమా లుక్ తోనే కనిపిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న దసరా సినిమా 2023 మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేశారు.