Begin typing your search above and press return to search.
నాని అప్పుడే కొత్త లుక్ లోకి మారిపోయాడు
By: Tupaki Desk | 23 Feb 2016 1:56 PM GMTఏడాది కాలంగా నాని సుడి మామూలుగా లేదు. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ లాంటి హిట్లతో తన స్థాయి బాగా పెంచుకున్నాడు నేచురల్ స్టార్. ఇప్పుడిక నాని తర్వాతి సినిమా మీద కూడా జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తన కోసం చాలామంది లైన్లో ఉన్నప్పటికీ నాని మాత్రం తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయడానికి డిసైడయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా మొదలై.. అప్పుడే సగం పూర్తయింది. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సందర్భంగా ముందు రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి అతడికి బర్త్ డే విష్ చెప్పింది ఈ చిత్ర యూనిట్.
కృష్ణగాడి వీర ప్రేమగాథతో పోలిస్తే ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు నాని.నాని హావభావాలు కానీ.. అతడి లుక్ కానీ.. చాలా సీరియస్ గా ఉన్నాయి. దీన్ని బట్టే నాని గత సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇంద్రగంటి ఇప్పటిదాకా ఎక్కువగా ఎంటర్టైనర్సే చేశాడు కానీ.. ఈ సినిమా మాత్రం కొత్తగా ఉంటుందంటున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ కు ఇంద్రగంటి ఓ కొత్త జానర్ పరిచయం చేయబోతున్నట్లు నాని చెప్పాడు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేద థామస్, సురభి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.