Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో నాని హీరో కాదు.. విలన్‌ కాదట

By:  Tupaki Desk   |   25 Feb 2019 6:53 AM GMT
ఆ సినిమాలో నాని హీరో కాదు.. విలన్‌ కాదట
X
నాచురల్‌ స్టార్‌ నాని ఇప్పటికే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రెండు సినిమాలు చేశాడు. త్వరలోనే మూడవ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేయబోతున్న మూవీ మల్టీస్టారర్‌ అంటూ వార్తలు వచ్చాయి, ఆ తర్వాత నాని ద్వి పాత్రాభినయం చేయబోతున్నాడు, ఒక పాత్ర విలన్‌ గా కనిపించబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా గురించి నాని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

త్వరలో ఇంద్రగంటి గారి దర్శకత్వంలో నటించనున్న మాట వాస్తవమే, విలన్‌ గా నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు, అలాగే ఇది మల్టీస్టారర్‌ అనే విషయం కూడా నిజం కాదని నాని పేర్కొన్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటించబోతున్న ఆ చిత్రంలో నేను ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాను. ఆ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, నా కెరీర్‌ లో చాలా ప్రత్యేకంగా ఉంటుందని నాని అన్నాడు. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడంను తాను ఎప్పుడు ఆస్వాదిస్తానంటూ నాని చెప్పుకొచ్చాడు.

మరో వైపు నాని 'జెర్సీ' చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నాడు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే జెర్సీ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఇక మరో వైపు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాని ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంకు 'గ్యాంగ్‌ లీడర్‌' అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. వరుసగా చిత్రాలు చేస్తున్న నాని గెస్ట్‌ రోల్‌ లో కూడా నటించేందుకు ఒప్పుకున్నాడట.