Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌.. మహేష్ బాబుల మాదిరిగా నాని కూడా..!

By:  Tupaki Desk   |   18 Jun 2022 7:11 AM GMT
ఎన్టీఆర్‌.. మహేష్ బాబుల మాదిరిగా నాని కూడా..!
X
ఒకప్పుడు సీనియర్ స్టార్‌ హీరోలు కుటుంబాలకు ఎక్కువ సమయం ఇచ్చే వారు కాదని.. వారిని కనీసం బయటకు కూడా తీసుకు వచ్చే వారు కాదనే ఒక చర్చ ఉంది. కాని ఇప్పుడు స్టార్‌ హీరోల.. చిన్న హీరోలు అలా కాదు. తమ ఫ్యామిలీస్ ను సాధ్యం అయినంత మేరకు బయటకు తీసుకు వచ్చేందుకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. హీరోలు తాము హాజరు అవుతున్న కార్యక్రమాలకు కూడా ఫ్యామిలీస్ ను తీసుకు వెళ్లడం మనం చూస్తున్నాం.

మహేష్‌ బాబు.. ఎన్టీఆర్‌.. చరణ్‌ ఇంకా చాలా మంది టాలీవుడ్‌ హీరోలు ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యి ప్రమోషన్ హడావుడి పూర్తి అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక దేశానికి హాలీడే ట్రిప్ అంటే చెక్కేస్తున్నారు. ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు అయినా హాలీడేస్ కు వెళ్తున్న స్టార్స్ మన టాలీవుడ్‌ లో చాలా మంది ఉన్నారు.

నిన్న మొన్నటి వరకు అంటే సుందరానికి సినిమా తో బిజీ బిజీగా గడిపిన నాచురల్‌ స్టార్‌ నాని ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

రాబోయే కొన్ని రోజుల పాటు నాని తన కుటుంబ సభ్యులతో హాలీడేస్ ను ఎంజాయ్ చేయబోతున్నాడు. భార్య మరియు కొడుకుతో కలిసి ఇప్పటికే వెకేషన్ లో నాని ఉన్నాడని కూడా ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

చాలా మంది హీరోలు షూటింగ్‌ లతో మరియు ఇతర కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. కనుక సినిమా విడుదల అయ్యి ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని.. అలా హాలీడేస్ ను ఎంజాయ్‌ చేయడం వల్ల చాలా మానసిక ప్రశాంతత కలుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు చాలా మంది అంటూ ఉంటారు.

ఫ్యామిలీ తో సమయం గడపడం అనేది మంచి పరిణామం. ఫ్యామిలీకి ఎంత సమయం ఎక్కువ కేటాయిస్తే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. కనుక తాజాగా నాని కూడా ఇతర స్టార్స్ మాదిరిగానే ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్‌ కోసం వెకేషన్ కు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత దసరా సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. నాని దసరా సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.