Begin typing your search above and press return to search.
నాని దర్శకత్వానికి స్క్రిప్టు రెడీ చేశాడా?
By: Tupaki Desk | 10 Oct 2020 7:50 AM GMTఏదో బతికేశాంలే అని కాకుండా ఇలా బతకాలి! అన్నంత క్లారిటీ కొందరికే సాధ్యం. చాలా మంది బిజీ లైఫ్ పేరుతో కుటుంబ జీవనానికి దూరం అవుతుంటారు. అలాంటివారందరికీ మహమ్మారీ సరైన సొల్యూషన్ ఇచ్చింది. బిజీ లైఫ్ కి చెక్ పెట్టి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని గుర్తు చేసింది వైరస్. ఏదైతేనేం.. టాలీవుడ్ సెలబ్రిటీలంతా బుద్ధిగా బిజీ పాఠాలు వల్లించక కుటుంబంతో టైమ్ స్పెండ్ చేసారు. ఎన్నో సంసార సాగర మధురిమల్ని ఆస్వాధించారు ఆరేడు నెలలుగా.
ఇక నేచురల్ స్టార్ నానీ అయితే నలుగురికి ఆదర్శంగా ఉండాలని ఇంట్లోంచే బయటకి రాలేదట. భార్య పిల్లలతో ఇంట్లోనే సాగరాన్ని ఈదాడట. పిల్లలతో ఫుల్ గా ఎంజాయ్ చేశాడట. బిజీ లైఫ్ వల్ల ఇదివరకూ ఇలా కుదిరేది కాదు. కుటుంబంతో నాణ్యమైన సమయం గడపలేకపోయాడు. ఏళ్లుగా తన బిజీ షెడ్యూల్ కారణంగా అతను ఎంతో మిస్సయ్యాడు. కానీ దీని నుంచి బయటపడి.. అతడు లాక్ డౌన్ రూపంలో కంబ్యాక్ అవ్వగలిగాడట.
నాని సహాయ దర్శకుడిగాగా ఉన్నప్పటి నుంచి దర్శకుడవ్వాలన్న కోరిక రచయితగా రాణించాలన్న కోరిక అలానే ఉండిపోయాయి. దీనిపై ఈ లాక్ డౌన్ లో సీరియస్ గానే ఆలోచించాడట. అయితే తాను దర్శకుడిగా పరిచయం అయ్యే సినిమాకి స్క్రిప్టు రెడీ చేశాడా లేదా? అన్నది తనే రివీల్ చేయాల్సి ఉంటుంది. ఇక సినిమా హాల్స్ కి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేయడం తనకు ఎంతో ఇష్టం. కానీ అది ఈ లాక్ డౌన్ లో కుదరలేదు. తదుపరి కెరీర్ సంగతి ని కూడా ప్రణాళికా బద్ధంగా తీర్చిదిద్దాలని లెక్కలు వేసాడట. తదుపరి టక్ జగదీష్ ని పూర్తి చేయాల్సి ఉండగా.. పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. దర్శకులు స్క్రిప్టుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.