Begin typing your search above and press return to search.
నాని 'జెర్సీ' మ్యాచ్ ఫైనల్ రిజల్ట్ షాకింగ్
By: Tupaki Desk | 17 May 2019 9:44 AM GMTనాచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాద్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జెర్సీ'. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుండి కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. యాంటీ క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రం బి,సి సెంటర్లలో అంతగా వసూళ్లను దక్కించుకోలేక పోయింది. అదే సమయంలో కాంచన 3 చిత్రం ఉండటం వల్ల బి,సి సెంటర్ల ప్రేక్షకులు జెర్సీని పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ జెర్సీని బాగానే ఆధరించారు. ఇక ఏ సెంటర్ లో మంచి వసూళ్లనే జెర్సీ రాబట్టింది.
జెర్సీ బాక్సాఫీస్ ఇన్నింగ్స్ సుదీర్ఘంగా సాగింది. నాలుగు వారాల పాటు ఈ చిత్రం సందడి కొనసాగింది. తాజాగా మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి రావడంతో జెర్సీ ఆట ముగిసిందని చెప్పుకోవాలి. మొదట కాస్త చప్పగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడంతో బ్రేక్ ఈవెన్ అయినా సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విడుదలకు ముందు ఈ చిత్రం 27 కోట్లకు అమ్ముడు పోయింది. బ్రేక్ ఈవెన్ సాధిస్తే గొప్ప విషయం అనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం లాంగ్ రన్ లో ఏకంగా 34 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనుకున్న సినిమా కాస్త నిర్మాతలకు ఏడు కోట్లకు పైగా లాభాలను తెచ్చి పెట్టింది. కొన్ని ఏరియాల్లో కాస్త అటు ఇటుగా బయ్యర్ల పెట్టుబడి రాబట్టగా, కొన్ని ఏరియాల్లో మాత్రం బయ్యర్లకు లాభాల పంట పండించిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాని స్టార్ డంతో ఈ వసూళ్లు నమోదయ్యాయని చెప్పుకోవాలి. మొదటి వారంలో అలాంటి టాక్ వచ్చిన సినిమాకు ఇంతగా వసూళ్లు రావడం గొప్ప విషయం. ఈ చిత్రంకు కాంచన మొదటి రెండు వారాల్లో పోటీగా ఉన్నా ఆ తర్వాత అది వెళ్లి పోయింది. ఆ తర్వాత జెర్సీ సత్తా చాటింది. నాని కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.