Begin typing your search above and press return to search.

నాని చుక్క‌ల్లో చంద్రుడు

By:  Tupaki Desk   |   30 Jan 2019 10:22 AM GMT
నాని చుక్క‌ల్లో చంద్రుడు
X
20కోట్లు.. 30 కోట్లు.. 50కోట్లు.. ఇదీ నాని గ్రాఫ్‌. కేవ‌లం ద‌శాబ్ధం కెరీర్ లోనే అత‌డు సాధించిన అద్భుత‌మిది. కెరీర్ ఆరంభ‌మే నాని 10-20 కోట్ల మేర బిజినెస్ రేంజును చాలా సింపుల్ గా సంపాదించుకుని ఎమ‌ర్జింగ్ హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు. అందుకోసం అంత ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌నేలేదు. అయితే ఆ త‌ర్వాత రూ.30కోట్ల రేంజును ట‌చ్ చేయ‌డానికి చాలానే గ్యాప్ తీసుకోవాల్సి వ‌చ్చింది. పైగా కొన్ని వ‌రుస‌ ప‌రాజ‌యాల‌తో రేస్ లో వెన‌క‌బ‌డిపోయి, అటుపై ఇక నాని ప‌ని అయిపోయింది! అన్న టైమ్ లో అత‌డు తిరిగి పుంజుకున్న తీరు ఎంతో స్ఫూర్తిమంతం. ప్ర‌స్తుతం అత‌డు ఇండ‌స్ట్రీలో బంగారు బాతు. ఎంత పిండుకుంటే అంత‌! అయితే అత‌డికి ఈ స్థాయినిచ్చింది త‌న ఎంపిక‌లు, ప్ర‌తిభ మాత్ర‌మే.

ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ ఉన్న‌ స్టార్ హీరోల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన రూ.50కోట్ల క్ల‌బ్ ఇప్పుడు నాని చేతికి అందింది. కెరీర్ ప‌రంగా ఎంతో శ్ర‌మించి.. నేచుర‌ల్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుని.. ఇప్పుడు ఏకంగా 50కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుతం నాని స్థాయి ఎలా ఉంది.. అన్న‌ది ప‌రిశీలిస్తే అందుకు జెర్సీ ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రిశీలిస్తే స‌రిపోతుంది.

ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్త రిలీజ్ హ‌క్కుల రూపంలో 53కోట్ల మేర‌ బిజినెస్ పూర్తి చేసిందిట‌. ఏపీ, తెలంగాణ -30 కోట్లు, శాటిలైట్ -12కోట్లు, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ -6 కోట్లు, ఓవ‌ర్సీస్ - 4కోట్లు, ఇత‌ర‌త్రా మార్గాల్లో మ‌రో కోటి బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. రూ.50 కోట్ల బిజినెస్ రేంజ్ అంటే అది ఆషామాషీ రేంజ్ కాద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. తాజా చిత్రంలో నాని స‌ర‌స‌న శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ రామ‌చంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. క్రికెట్ నేప‌థ్యంలో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిద‌ని యూనిట్ చెబుతోంది. నాని తొలిసారి త‌న కెరీర్ లో క్రికెట‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మారిన ట్రెండ్ లో క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది.