Begin typing your search above and press return to search.
చైనాలో `జెర్సీ` రిలీజ్ ప్లాన్స్
By: Tupaki Desk | 8 April 2019 4:31 PM GMTఇటీవలి కాలంలో యూనివర్శల్ కాన్సెప్టులు ఉన్న సినిమాల వెల్లువ మొదలైంది. బయోపిక్ ట్రెండ్ తో పాటు విభిన్నమైన కాన్సెప్టుల్ని ఎంచుకుని మన దర్శకనిర్మాతలు చేస్తున్న ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎంచుకున్న కాన్సెప్టు ఏదైనా ఎమోషన్ కి కనెక్ట్ చేయగలిగితే చాలు అది ప్రపంచంలో ఎక్కడైనా రిలీజ్ చేయొచ్చు.. హిట్ కొట్టొచ్చు.. అన్న ధీమా మన దర్శకనిర్మాతల్లో, హీరోల్లో కనిపిస్తోంది. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న జెర్సీ చిత్రం ఆ కోవకే చెందుతుందా? అంటే అవుననే ధీమాను కనబరుస్తున్నారు నిర్మాత వంశీ.
నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత .. నిర్మాత వంశీ మాట్లాడుతూ .. జెర్సీ చిత్రాన్ని క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించాం. యూనివర్శల్ కాన్సెప్టు ఉన్న చిత్రమిది. ప్రస్తుతానికి తెలుగు రిలీజ్ పైనే దృష్టి సారించామని తెలిపారు. ఏప్రిల్ 19న ఈ సినిమా వస్తుందా.. రాదా? అంటూ సందిగ్ధతలు వ్యక్తమవుతున్నాయి. అయితే చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తామని నిర్మాత వంశీ తెలిపారు. చైనాలో ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఒకవేళ రిలీజ్ చేస్తే భారీగానే రిలీజ్ చేసే వీలుందని తెలుస్తోంది. అయితే చైనాకు కనెక్టివిటీ పాయింట్ ఏంటి? క్రికెట్ అక్కడ ఆడరు కదా? అని సందేహం వ్యక్తం చేస్తే ఎమోషన్ కనెక్టయితే చాలు అంటూ సమాధానం ఇచ్చారు.
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్ లు ఇప్పటికే బాలీవుడ్ లో బంపర్ హిట్లు కొట్టాయి. భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు విజయాలు సాధించాయి. అలాగే క్రికెట్ నేపథ్యంలో ఎం.ఎస్ ధోని - సచిన్ బయోపిక్ లు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలోని జెర్సీ చిత్రంపైనా జనాల్లో అంచనాలేర్పడ్డాయి. అయితే ఇది బయోపిక్ కేటగిరీకి చెందదు. అలాగని ఎవరో ఓ నిజజీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నది కానేకాదని నాని తెలిపారు.