Begin typing your search above and press return to search.
జెర్సీకి పోటీ కళంకం
By: Tupaki Desk | 9 March 2019 2:30 PM GMTన్యాచురల్ స్టార్ నాని జెర్సీ డేట్ అఫీషియల్ అయిపోయాక అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టుకున్నారు. ఎలాగూ మహేష్ మహర్షి పోటీ నుంచి తప్పుకుంది కాబట్టి సేఫ్ గా దున్నేయొచ్చు అనేది వాళ్ళ నమ్మకం. సరిగ్గా అదే తేదీకి వేరే టాలీవుడ్ మూవీ లేదు కానీ ఓ బాలీవుడ్ మల్టీ స్టారర్ మాత్రం ఛాలెంజ్ విసిరెందుకు రెడీ అవుతోంది. అదే కళంక్. బాలీవుడ్ లోనే అత్యంత భారీ సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతున్న కళంక్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి .
వరుణ్ ధావన్-అలియా భట్-సోనాక్షి సిన్హా-మాధురి దీక్షిత్-సంజయ్ దత్- ఆదిత్య రాయ్ కపూర్ ఇలా ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో బాలీవుడ్ లోనే అతి పెద్ద నిర్మాణ సంస్థలైన ధర్మా ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ నడియాడ్ వాలా గ్రాండ్ సన్ లు కలిసి దీన్నో విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ట్రైలర్ వచ్చాక దీని మీద హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోతుందని కరణ్ చాలా నమ్మకంగా ఉన్నాడు
ఈ కళంక్ సరిగ్గా ఏప్రిల్ 19నే విడుదల కానుంది. ఇదో మాములు మీడియం బడ్జెట్ సినిమానో లేదా చిన్న హీరో మూవీనో అయ్యుంటే పెద్ద సమస్య కాదు. కాని ఏ సెంటర్స్ తో పాటు మల్టీ ప్లెక్సుల్లో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ జెర్సీ కి ఇబ్బందులు తప్పక పోవచ్చు. పైగా తెలుగు తమిళ్ ప్రాంతీయ బాషలలో దీన్ని డబ్బింగ్ చేసే ఆలోచన కూడా జరుగుతోంది. దాదాపు ఖాయమైనట్టే.
అదే జరిగితే మాస్ కు త్వరగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న కళంక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న జెర్సీకి గట్టి పోటీ ఇవ్వడం తప్పదు. ఇందులో మధురి దీక్షిత్ వేసిన పాత్రకు తొలుత శ్రీదేవిని అనుకున్నారు. ఆవిడ అకాల మరణం తర్వాత మధురి దీక్షిత్ వచ్చింది