Begin typing your search above and press return to search.
జెర్సీ బుల్లితెర పైనా నిరాశేనా!
By: Tupaki Desk | 1 Aug 2019 4:52 PM GMTనేచురల్ స్టార్ నాని నటించిన `జెర్సీ` బ్యాక్ టు బ్యాక్ షాక్ లివ్వడం చర్చకొచ్చింది. ఇటీవలే పెద్దతెరపై రిలీజైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. క్లాస్ ఆడియెన్ ని మెప్పించినంతగా మాస్ ని థియేటర్లకు రప్పించడంలో తడబడడంతో వసూళ్లపై ఆ ప్రభావం కనిపించింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్.. మిడిల్ క్లాస్ ఇబ్బందుల నేపథ్యంలో నవ్యపంథా కథాంశాన్ని ఎంచుకుని డెబ్యూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేసిన ప్రయోగం క్రిటిక్స్.. క్లాస్ ఆడియెన్ కి నచ్చినా ఫైనల్ రిజల్ట్ మాత్రం ఊహించని షాక్ నే ఇచ్చింది. ఈ సినిమా పెద్ద తెరపై అంతంత మాత్రమే అనిపించినా.. బుల్లితెరపై అయినా అలరిస్తుందని భావించారు.
కానీ అక్కడా ఆశించిన రిజల్ట్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాని ఇటీవలే జీ-తెలుగులో వరల్డ్ ప్రీమియర్ వేశారు. అయితే కేవలం 8.8 రేటింగ్ తో నిరాశను మిగిల్చింది. బుల్లితెరపై తొలిసారి వేసినా జెర్సీకి ఆదరణ దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ `ఎఫ్2` ఇప్పటికే రెండు సార్లు టెలీకాస్ట్ చేశారు. మూడోసారి టీవీలో వేసినా `జెర్సీ` కంటే బెటర్ గా ఆదరణ దక్కించుకుంది. ఎఫ్ 2కి ఏకంగా 9.6 రేటింగ్ దక్కడం చూస్తుంటే మసాలా ఆడియెన్ ఆదరణ ఉంటేనే బుల్లితెర రేటింగుల్లోనూ పనవుతుందని ప్రూవైంది. క్లాస్ గా ఉంటే క్లాస్ ఆడియెన్ వరకే చేరుతుంది. మాసీగా ఉంటే మాసివ్ గా ఆదరణ దక్కుతుందని దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
`జెర్సీ` చిత్రం వెండితెర.. బుల్లితెర రెండు చోట్లా నిరాశపరచడం ఆశ్చర్యకరమే. చాలా సినిమాలు పెద్ద తెరపై ఫెయిలై బుల్లితెరపై అలరిస్తుంటాయి. మహేష్ నటించిన `అతడు`.., బాలకృష్ణ `పరమవీర చక్ర` అలానే ఆదరణ పొందాయని అప్పట్లో ప్రచారమైంది. కనీసం అలా అయినా జెర్సీ ఆదరణ దక్కించుకోలేదేమిటో!