Begin typing your search above and press return to search.

యాక్షన్ మోడ్ లో దిగిన నాని

By:  Tupaki Desk   |   11 Aug 2019 8:02 AM GMT
యాక్షన్ మోడ్ లో దిగిన నాని
X
ఈ ఏడాది జెర్సీతో మంచి బోణీ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని వచ్చే నెల 13న గ్యాంగ్ లీడర్ తో అల్లరి చేయబోతున్నాడు. ఇప్పటికే దీని టీజర్ భారీ స్పందన దక్కించుకుని అంచనాలు పెంచేసింది. 2019లో మూడు సినిమాలు చేస్తానని కమిట్ మెంట్ ఇచ్చిన నాని దానికి తగ్గట్టే ప్లానింగ్ తో సాగుతున్నాడు. గతంలో ప్రారంభమైన ఇంద్రగంటి మోహనకృష్ణ వి షూటింగ్ లో నాని ఇవాళ్టి నుంచి ఎంట్రీ ఇచ్చాడు. తన పాత్రకు సంబంధించి కంటిన్యూగా షూట్ లో పాల్గొని పూర్తి చేయబోతున్నాడు.

సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా అదితి రావు హైదరి హీరోయిన్ గా చేస్తోంది. కానీ కథ మొత్తం నాని పాత్ర చుట్టూ తిరిగేలా చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఇందులో ఉంటుందని యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. అంతే కాదు ఒకరకమైన నెగటివ్ షేడ్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది. ఈ డిసెంబర్ చివర్లో ప్లాన్ చేసిన రిలీజ్ కు తగ్గట్టే వేగంగా ఫినిష్ చేసేలా ఇంద్రగంటి ప్లానింగ్ తో ఉన్నట్టు తెలిసింది.

గతంలో నాని ఈయన కాంబినేషన్ లో అష్టా చెమ్మా-జెంటిల్ మెన్ వచ్చాయి. రెండూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మొదటిది నాని కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. ఆ అభిమానంతోనే నాని ఇలాంటి స్పెషల్ రోల్ కు ఒప్పుకున్నట్టు వినికిడి. నాని ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొంటాడు అనే వివరాలు ప్రస్తుతం బయటికి చెప్పలేదు కానీ నవంబర్ కంతా అయిపోతుందని న్యూస్. సో మొత్తానికి మూడు డిఫరెంట్ రోల్స్ తో నాని రచ్చ గట్టిగానే ఉండేలా ఉంది