Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో నాన్ స్టాప్ నాని

By:  Tupaki Desk   |   17 Jan 2018 3:39 PM GMT
ఓవర్సీస్ లో నాన్ స్టాప్ నాని
X
న్యాచురల్ స్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో హ్యాపీగా క్లోజ్ చేసిన నాని  కొత్త సంవత్సరం డ్యూయల్ రోల్ లో కృష్ణార్జున యుద్ధంతో ఏప్రిల్ లో రాబోతున్నాడు. దీని మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. రెండు పాత్రలకు సంబంధించి పోస్టర్స్ వచ్చాక ఇవి ఇంకాస్త పెరిగాయి. రిలీజ్ చేసిన సింగల్ సాంగ్ కూడా చిత్తూర్ స్లాంగ్ తో మంచి కిక్కిచ్చేలా ఉండటంతో హైప్ కూడా పెరుగుతూ పోతోంది. భలే భలే మగాడివోయ్ నుంచి తన ఓవర్సీస్ మార్కెట్ ని స్థిరపరచుకున్న నాని సినిమా సినిమాకు దాన్ని మెరుగుపరుచుకుంటూ పోతున్నాడు. తాజాగా అందిన సమాచారం మేరకు కృష్ణార్జున యుద్ధం ఓవర్సీస్ రైట్స్  కోసం మ్యగ్నస్ మీడియా సంస్థ 4.14 కోట్లకు ఒప్పందం చేసుకుందనే వార్త ట్రేడ్ లో చర్చనీయంశంగా మారింది. నానికున్న మార్కెట్ పెద్దదే అయినప్పటికీ ఇది రిస్క్ తో కూడుకున్న పెట్టుబడే. కాని నాని సినిమాల మీద అక్కడి ప్రేక్షకులకున్న నమ్మకం లాభాలతో సహా వెనక్కు ఇస్తుందని సంస్థ నమ్మకం.

నాని మాస్ అండ్ క్లాస్ రోల్స్ లో డ్యూయల్ రోల్స్ చేస్తున్న ఈ మూవీ పూర్తిగా ఇద్దరు నానిల మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటంగా మలిచినట్టు టాక్. కృష్ణ, అర్జున్  మధ్య జరిగే పోరుని ఎంటర్టైన్మెంట్ జోడించి దర్శకుడు మేర్లపాక గాంధీ దీన్ని తీర్చిదిద్దిన్నట్టు ఇన్స్ సైడ్ టాక్. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇలా క్లాస్ అండ్ మాస్ టచ్ తో నాని డ్యూయల్ రోల్ చేసిన మూవీ గతంలో జెండాపై కపిరాజు వచ్చింది కాని అది పొలిటికల్ థ్రిల్లర్ కావడం, దర్శకుడు తమిళ ఫ్లేవర్ లో తీయటంతో తేడా వచ్చింది. కాని వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ - ఎక్స్ ప్రెస్ రాజా తో తన మేకింగ్ ని రుజువు చేసుకున్న గాంధీ దీన్ని వాటికి మించే స్థాయిలో రూపొందించినట్టు తెలిసింది. మరి నాని కృష్ణార్జున యుద్ధంతో బోణీ కొట్టడం చూడాలంటే ఏప్రిల్ దాకా ఆగాలి.