Begin typing your search above and press return to search.

డబుల్ యుద్దం టీజర్ ఎప్పుడంటే..

By:  Tupaki Desk   |   8 March 2018 11:48 AM IST
డబుల్ యుద్దం టీజర్ ఎప్పుడంటే..
X

మామూలుగా ఒక సినిమాలో హీరో ఒకసారి ఒక క్యారక్టర్లో కనబడితేనే మాస్ ప్రేక్షకులకు మజా వచ్చేస్తోంది. అటువంటిది న్యాచురల్ స్టార్ అంటూ ప్రూవ్ చేసుకున్నాక..ఇప్పుడు మరోసారి తెరపై రెండుసార్లు రెండు క్యారక్టర్లలో కనిపిస్తాను అంటున్నాడు నాని. అదే ''కృష్ణార్జున యుద్దం'' సినిమా. మేర్లపాక గాంధి డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా తాలూకు టీజర్ ఎప్పుడొస్తుందో ఇప్పుడు అఫీషియల్ గా తెలిసిపోయింది.

ఒక ప్రక్కన క్లాస్ కుర్రాడిగా.. మరోప్రక్కన మాస్ రాయలసీమ పిల్లోడిగా.. హీరో నాని ఈ సినిమాలో డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఓ రెండు పాటలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా 'దారి చూడు దుమ్ము చూడు మామ' అనే పాట ఉర్రూతలూగిస్తోంది. ఈ సమయంలో మనోడు మార్చి 10న పొద్దున్న 10 గంటలకు ఈ 'కృష్ణార్జున యుద్దం' సినిమా టీజర్ రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించేశాడు. మొత్తానికి వరుస హిట్లతో ఊపుమీదున్న నాని.. ఇప్పుడు మరోసారి అదే ఊపుతో ఏ మాత్రం డిలే చేయకుండా వచ్చేస్తున్నాడనమాట. మరి డబుల్ యాక్షన్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇకపోతే ఈ మధ్యన తెలుగు సినిమాలవారు ఒక పద్దతిని భలే ఫాలో అవుతున్నారు. మొన్న భరత్ అను నేను టీజర్ ను.. మార్చి 6న సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. ఇప్పుడు కృష్ణార్జున యుద్దం కూడా మార్చి 10న పొద్దున్న 10 గంటలకు విడుదల చేస్తున్నారు. అంటే రైమింగ్ కోసం డేట్ అండ్ టైమ్ తాలూకు టైమింగ్ మ్యాచ్ చేస్తున్నారనమాట. కానివ్వండి.