Begin typing your search above and press return to search.

డ్యూయల్ కార్లలో కృష్ణార్జునులు

By:  Tupaki Desk   |   8 April 2018 12:08 PM GMT
డ్యూయల్ కార్లలో కృష్ణార్జునులు
X
న్యాచురల్ స్టార్ నాని కృష్ణార్జునుల యుద్ధం విడుదలకు మరో ఐదు రోజులే ఉన్న నేపధ్యంలో ప్రమోషన్ వేగం పెంచేశారు. ఇందులో హీరో పాత్ర డ్యూయల్ రోల్ కనక దానికి తగ్గట్టే వినూత్నంగా రెండు కార్లను ఒకదాని పై ఒకటి జోడించి తిప్పుతున్న తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. పైన మీరు చూస్తున్న పిక్ దానిదే. నాని ఇప్పటి దాకా రెండు సార్లు ద్విపాత్రాభినయం చేసాడు. అందులో జెండాపై కపిరాజు మొదటిది కాగా రెండోది జెంటిల్ మెన్. కృష్ణార్జున యుద్ధం మూడో సినిమా. చిత్తూర్ యాసలో మాట్లాడే మాస్ యూత్ గా ఒక పాత్ర ఉండగా రాకింగ్ స్టార్ గా విదేశాల్లో పేరు తెచ్చుకున్న గాయకుడిగా మరో పాత్రలో నాని పూర్తి వైరుధ్యమైన వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్-రుక్సన్ మీర్ హీరొయిన్లుగా నటించిన ఈ మూవీకి హిప్ హాప్ తమిజా సంగీత దర్శకుడు.

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం నుంచి తిరిగి కొత్త కళ వచ్చేసింది. చల్ మోహనరంగా పాస్ అయిపోగా ఇప్పుడు వస్తున్న కృష్ణార్జున యుద్ధంతో ఇది పీక్స్ కి చేరుకోబోతోంది. నాని లాస్ట్ మూవీ ఎంసిఎ కమర్షియల్ గా మంచి విజయం సాధించడం దీనికి ప్లస్ గా మారుతోంది. పైగా రెండు పాత్రలు అనగానే ఆసక్తి రెట్టింపు కావడం సహజం. ఎన్టీఆర్-ఎఎన్ ఆర్ నటించిన అల్ టైం బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ మూవీ టైటిల్ వాడుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దీన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు స్పష్టమవుతోంది. ఇటీవలే విడుదల చేసిన దారి చూడు దుమ్ము చూడు వీడియో ప్రోమో అంచనాలు అమాంతం పెంచేసింది. న్యాచురల్ గా మెప్పించే నానిని ఇలా డబుల్ డోస్ లో చూడటం కంటే ఫాన్స్ కు కావలసింది ఏముంటుంది. అందుకే కృష్ణార్జునులు అందరి దృష్టిని మెల్లగా తమ వైపు తిప్పుకుంటున్నారు.