Begin typing your search above and press return to search.

సరికొత్త ఫ్రెంచ్ లుక్కులో నాని 'టక్ జగదీష్'..

By:  Tupaki Desk   |   20 March 2020 9:30 AM GMT
సరికొత్త ఫ్రెంచ్ లుక్కులో నాని టక్ జగదీష్..
X
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా సరైన హిట్ ను అందుకోలేకపోయాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయేసరికి తనకు రెండు బ్లాక్ బస్టర్లను అందించిన మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలో నటిస్తున్నాడు. నాని - సుధీర్ బాబులు జంటగా నటిస్తున్న ఈ సినిమాకు 'వి' అనే టైటిల్ ని చిత్రయూనిట్ ఫిక్స్ చేసారు. 'వి' సినిమా ఈ నెల ఉగాదికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినా కరోనా ఎఫెక్ట్ వలన వాయిదా వేయక తప్పలేదు.

ఇక 'వి' సినిమా షూటింగులో ఉండగానే నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టక్ జగదీష్' సినిమాలో నటిస్తున్నాడు. స్టైలిష్ ఫ్రెంచ్ గడ్డంలో మధ్య తరగతి కుర్రాడి పాత్రలో నాని కనిపించనున్నాడట. అంతేగాక ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ జగపతి బాబు కీలక పాత్రను పోషిస్తున్నాడట. నానిని ఇంతవరకు చూడని లుక్కులో చుపిస్తానంటున్నాడు డైరెక్టర్ శివ. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ని ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. హీరో నానికి నిన్నుకోరి సినిమాతో పెద్ద హిట్ అందించిన శివ నిర్వాణ రెండోసారి జతకట్టడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.