Begin typing your search above and press return to search.

ఈ నాని భలే భలే మంచోడండీ!!

By:  Tupaki Desk   |   26 July 2016 1:30 PM GMT
ఈ నాని భలే భలే మంచోడండీ!!
X
చాలామంది హీరోలు తమ ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోల ఫంక్షన్లకే అటెండవ్వరు. కొందరు హీరోలైతే అస్సలు తమ సినిమాల ఆడియో ఫంక్షన్లే సరిగ్గా చేయరు. కాని కొంతమంది మాత్రం అరుదైన జాతి రత్నాల టైపులో.. ఫిలిం ఇండస్ర్టీ అంతా మన చుట్టాలే అన్నట్లు అందరి గురించీ చాలా పాజిటివుగా ఉంటారు. అలాంటి హీరోల్లు నాని ఒకడు.

నిజానికి నాని దగ్గర ఉన్న టాలెంటుకు.. అతని వెనుక ఎప్పుడూ ఓ నలుగురు డైరక్టర్లు పడుతూనే ఉంటారు. అందువలన మనోడు వేరే ఇతర హీరోలతో మాంచి ఫ్రెండ్ షిప్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. కాని అలా ఆలోచిస్తే అతను నాని ఎందుకు అవుతాడు. చూడండి మొన్ననే నిత్యా మీనన్‌ 100 డేస్ ఆఫ్‌ లవ్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌ కు చీఫ్‌ గెస్టుగా వచ్చాడు. నిన్న బాబూ బంగారం సినిమాలో ఆడియో లాంచుకు విచ్చేసి వెంకీ కలకాలం మసాలా సినిమాలు చేస్తే చూడాలనివుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇవాళ అల్లు శిరీష్‌ శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ చాలా బాగుందంటూ ట్వీట్లు వేశాడు. ఇదంతా చూస్తే మీకు ఏం అర్ధమవుతోంది?

ఇండస్ర్టీలో ఉన్న సాటి హీరోలందరితో సోషలైజ్ అవుతూ.. చక్కగా వారిని ఎంకరేజ్ చేస్తూ.. తను ఎంజాయ్ చేస్తూ.. భలే లవ్లీగా బిహేవ్ చేస్తున్నాడు కదండీ నాని. ఈ కాలంలో ఇలాంటి హీరోలను చూస్తే చాలా మంచోడనే చెప్పాలి మరి.