Begin typing your search above and press return to search.
నేచురల్ స్టారా మజాకా..?
By: Tupaki Desk | 16 Aug 2016 12:31 PM GMTఏడాదిన్నర వ్యవధిలో నాలుగు హిట్లు.. టాలీవుడ్లో ఇంకే హీరోకూ ప్రస్తుతం ఇలాంటి ఘనమైన రికార్డు లేదు. ఆ ఘనత నానికి మాత్రమే దక్కింది. గత ఏడాది ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి.. తాజాగా ‘జెంటిల్ మన్ వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు నాని. ముఖ్యంగా ఓవర్సీస్ లో నాని రేంజి సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. అతడి సినిమాలు పెట్టుబడి మీద భారీ లాభాలు అందిస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ దాదాపు 1.5 మిలియన్ డాలర్లు కొల్లగొడితే.. తర్వాత వచ్చిన రెండు సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువగా వెళ్లాయి. దీంతో నాని తర్వాతి సినిమా ఓవర్సీస్ రైట్స్ మంచి రేటు పలుకుతున్నాయి.
నాని కొత్త సినిమా ‘మజ్ను’ అమెరికా హక్కులను ఒక డిస్ట్రిబ్యూటర్ సినిమా రూ..2.5 కోట్లకు కొనుగోలు చేశాడట. అతను మారు బేరాలకు ఏరియాల వారీగా సినిమాను అమ్మి రూ.3 కోట్ల దాకా సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ‘మజ్ను’ ఫస్ట్ లుక్ పోస్టర్లు - టీజర్లకు మంచి స్పందన రావడం.. ఈ సినిమా యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గ్లుగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. నాని సినిమా అంటే మినిమం హాఫ్ మిలియన్ డాలర్లు ఖాయం అనే పరిస్థితి ఉంది అమెరికాలో. నష్టాలొచ్చే ఛాన్సే ఉండదని ధైర్యంగా పెట్టుబడి పెడుతున్నారు. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మజ్ను’ సెప్టెంబర్లో రిలీజవుతుంది.