Begin typing your search above and press return to search.
బన్నీ ఇలాఖాలోకి నాని
By: Tupaki Desk | 4 Feb 2017 9:43 AM GMTపొరుగు భాషా కథానాయకులు మన ఇండస్ట్రీలో ఆధిపత్యం చలాయిస్తుంటే చాలా ఏళ్ల పాటు సైలెంటుగా ఉండిపోయిన మన హీరోలు ఈ మధ్యే బౌండరీల్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ మల్లూవుడ్లో పాగా వేశాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ కూడా తమిళం.. మలయాళం.. హిందీ భాషల్లో మార్కెట్ సంపాదించాడు. మహేష్ బాబు.. మురుగదాస్ సినిమాతో తమిళనాట కాలు మోపాలనుకుంటున్నాడు. మిగతా స్టార్ హీరోలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. రైజింగ్ స్టార్ నాని సైతం ఇదే బాటలో నడవబోతున్నాడు. అతను ఒక యావరేజ్ మూవీతో మల్లూవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు.
‘నేను లోకల్’తో కలిపితే వరుసగా ఆరు హిట్లు కొట్టాడు నాని. ఆ ఆరింట్లో చిన్న స్థాయి సినిమా అంటే ‘మజ్ను’నే. ఓ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఈ చిత్రాన్నే మలయాళంలోకి అనువాదం చేస్తున్నారు. మలయాళ నిర్మాత జీపీ సుధాకర్ ఈ చిత్రాన్ని కేరళలో విడుదల చేస్తున్నాడు. ఆల్రెడీ ‘మజ్ను’ ఆడియో కూడా రిలీజైపోయింది. నాని నటించిన సినిమాల్లో దీని కంటే పెద్ద హిట్లు ఉన్నా.. అనువాదం కోసం ‘మజ్ను’నే ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఈ సినిమాతో మలయాళ ప్రేక్షకులు కొంచెం ఐడెంటిఫై అయ్యే అవకాశముంది. ఈ చిత్ర కథానాయిక అను ఇమ్మాన్యుయెల్ మలయాళ అమ్మాయే. ఆల్రెడీ అక్కడ మంచి పేరు సంపాదించింది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్నందించిన గోపీసుందర్ అక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి నేటివిటీ ఇబ్బంది కూడా పెద్దగా ఉండదు. అందుకే ‘మజ్ను’ను మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/