Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురిని ఇబ్బంది పెడుతున్న నాని
By: Tupaki Desk | 23 Nov 2017 5:49 AM GMTనాని ఇప్పుడు చిన్న హీరో ఏ మాత్రం కాదు. మీడియం రేంజ్ హీరో అనే ట్యాగ్ కనిపిస్తున్నా.. ఇప్పటికే న్యాచురల్ స్టార్ అయిపోయాడు. కంటెంట్ కాసింత మధ్యస్తంగా ఉన్నా.. ఇంచుమించు స్టార్ హీరోలకు దరిదాపుల్లో వసూళ్లు రాబట్టేయగలుగుతున్నాడు. అందుకే పెద్ద హీరోల సినిమాల టైపులోనే.. నాని సినిమాలకు కాసింత దూరం పాటించాల్సి వస్తోంది.
కానీ ఇప్పుడు సినిమాల కౌంట్ బాగా పెరిగిపోయింది. పైగా డిసెంబర్ 15న నాని నటించిన ఎంసీఏ చిత్రాన్ని విడుదల చేస్తామని ముందుగా హింట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకునే.. అఖిల్ సెకండ్ మూవీ హలోను డిసెంబర్ 22కు షెడ్యూల్ చేశారు నాగార్జున. మరోవైపు సునీల్ నటించిన టూ కంట్రీస్ మూవీని కూడా ఇదే సమయంలో విడుదల చేయాలని భావించగా.. అల్లు శిరీష్ మూవీ ఒక్క క్షణం ను డిసెంబర్ 23న విడుదల చేస్తామని చెప్పారు అల్లు అరవింద్. కానీ ఎంసీఏకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదు. అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేస్తారనే హింట్.. డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందట.
నాని మూవీ రేసులోకి రావడంతో.. సునీల్ టూ కంట్రీస్ ను డిసెంబర్ 15కు మార్చాలని భావిస్తున్నారట. మరోవైపు అల్లు శిరీష్ సినిమాను ఓ వారం వెనక్కి జరిపే అవకాశం ఉందని అంటున్నారు. హలో విషయంపై పైకి ఎవరూ పైకి చెప్పడం లేదు కానీ.. ఒక్క రోజు గ్యాప్ లో నాని సినిమా ఉంటే.. అది అఖిల్ మూవీ వసూళ్లపై ప్రభావం చూపుతుందనే సంగతి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. తన సినిమాతో నాని ఇలా ముగ్గురు హీరోలను ఇబ్బంది పెడుతుండడం ఆశ్చర్యకరం.