Begin typing your search above and press return to search.
ఎంసిఎ-మరీ ఇంత త్వరగానా
By: Tupaki Desk | 19 Jan 2018 7:00 AM GMTడిజిటల్ సినిమా విప్లవంలో కొత్త మార్పులకు నాంది పలుకుతోంది అమెజాన్ ప్రైమ్. ఒకప్పుడు అంటే సుమారు పాతికేళ్ళ క్రితం ఒక సినిమా రిలీజ్ అయ్యాక అది టీవీలో రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టేది. స్టార్ హీరోలు నటించిన సినిమాకు ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండేది. కాలం మారింది. అన్నింటి మీద ప్రభావం చూపినట్టే సినిమా మీద కూడా టెక్నాలజీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. శాటిలైట్ హక్కులు తీసుకుని ఛానల్స్ లో వేసుకోవడమే పెద్ద మార్పు అనుకుంటున్న టైంలో చేతిలో స్మార్ట్ ఫోన్ - అందులో నెట్ కనెక్షన్ ఉంటె చాలు అరచేతిలో సరికొత్త వినోదాన్ని హాట్ హాట్ గా వడ్డించేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఈ దిశగా కొత్త అడుగులు వేస్తోంది.
నాని నటించిన ఎంసిఎ(మిడిల్ క్లాస్ అబ్బాయి)ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజుకి సినిమా విడుదలై 28వ రోజు. ఇంకా కొన్ని కేంద్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ రన్ అవుతోంది కూడా. అలాంటప్పుడు మరీ ఇంత త్వరగా ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పెట్టేస్తే ఇక థియేటర్ దాకా వచ్చేవారు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినా రావొచ్చు. అమెజాన్ ప్రైమ్ ఇలా చేయటం కొత్త కాదు. సాయి ధరం తేజ్ జవాన్ కూడా సరిగ్గా 28 రోజులకు పెట్టేసింది. రాజు గారి గది 2 - రాజా ది గ్రేట్ సినిమాలు కూడా ఇంకా టీవీలో టెలికాస్ట్ కాకముందే తమ సైట్ లో పెట్టేసింది అమెజాన్. తెలుగు మాత్రమే కాదు తమిళ్ - హింది సినిమాల విషయంలో కూడా ఇదే ఫాలో అవుతోంది అమెజాన్.
ఇలా నెల తిరక్కుండానే వీడియో స్ట్రీమింగ్ యాప్స్ లో హై క్వాలిటీతో కొత్త సినిమాలు రావడం గురించి నిర్మాత సురేష్ బాబు ఓ సినిమా సక్సెస్ మీట్ లో ప్రశ్నించడం తెలిసిందే. అయినా కూడా ఇందులో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. హక్కులను కొంటున్న సమయంలోనే చాలా స్పష్టంగా ఎన్ని రోజుల్లో ఇది ఆన్ లైన్ లో విడుదల చేస్తామో చెప్పి మరీ ఒప్పందం చేసుకుంటోంది అమెజాన్ ప్రైమ్. వాళ్ళు ఇస్తున్న ఆఫర్ అలా ఉన్నప్పుడు నిర్మాతలు మాత్రం ఎందుకు కాదంటారు. కాని వ్యవధి గురించి మాత్రం కాస్త అలోచించి నిర్ణయిస్తే మరికొద్ది రోజులు థియేటర్లలో సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది.ఇప్పటికి ఇలాంటి సైట్స్ పట్ల అవగాహన ఉన్నవాళ్లు తక్కువగా ఉన్నప్పటికీ 4జి విప్లవంలో తక్కువ సమయంలో దాని గురించి నేర్చుకోవడం పెద్ద విషయమేమీ కాదుగా.