Begin typing your search above and press return to search.

నేచుర‌ల్‌ స్టార్ ఎందుకీ రిస్క్‌!

By:  Tupaki Desk   |   15 Feb 2019 8:18 AM GMT
నేచుర‌ల్‌ స్టార్ ఎందుకీ రిస్క్‌!
X
నేచుర‌ల్ స్టార్ నాని ఓ ద‌శ‌లో వ‌రుస ఫ్లాపుల్ని చ‌విచూశాడు. ఆ స‌మ‌యంలో అత‌నితో సినిమా తీయ‌డానికి ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో కొంత నిరాశ‌లో వున్న నానికి మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాల్ని అందించిన చిత్రం `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`. నాని కెరీర్‌ని మ‌ళ్లీ గాడిలో పెట్టిన సినిమా ఇది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ - గీతా ఆర్ట్స్‌2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అమెరికా మార్కెట్లో నాని స‌త్తాను బ‌య‌ట‌పెట్టింది. తొలిసారి ఈ సినిమాతోనే నాని కోటి (1 మిలియ‌న్ డాల‌ర్) వ‌సూళ్ల క్ల‌బ్‌ లో చేరారు.

యుఎస్ మార్కెట్‌ లో అప్ప‌టి వ‌ర‌కు ద్వితీయ శ్రేణి హీరోల‌కు `మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌` అధిగ‌మించిన‌ దాఖలాలు లేవు. ఆ విష‌యంలో ముందు ఖాతా తెరిచింది నానినే కావ‌డం విశేషం. ఇన్ని ప్ర‌త్యేత‌లు ఉన్న‌ సినిమా ఇచ్చిన మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు నేచుర‌ల్‌ స్టార్. రీసెంట్‌ గా `శైల‌జారెడ్డి అల్లుడు`తో డిజాస్ట‌ర్ ను ఎదుర్కొన్న‌ మారుతికి సినిమా ఇవ్వ‌డానికి మెగా హీరోలే జంకుతుంటే నాని మాత్రం త‌నకు క‌ష్ట కాలంలో హిట్టిచ్చిన మారుతికి అండ‌గా నిలుస్తున్నాడు. ఈ సినిమాను నాని న‌టిస్తూ నిర్మించ‌బోతుండ‌టం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. `అ!` సినిమాతో నాని నిర్మాత‌గా మారిన విష‌యం తెలిసిందే. కాగా మారుతితో చేయ‌బోతున్న సినిమాకు దాదాపు 35 కోట్ల బ‌డ్జెట్ పెట్టేందుకు నాని సిద్ధ‌మ‌వుతున్నాడ‌న్న‌ది మ‌రో పెద్ద షాక్.

కృత‌జ్ఞ‌త చూప‌డం అంటే భారీగా న‌ష్ట‌పోయేలా ప‌ప్పులో కాలేయ‌డం కాద‌ని నాని చేస్తున్న సాహ‌సం తెలిసిన వాళ్లు హెచ్చ‌రిస్తున్నారు. అయినా త‌న‌కు మారుతి పైనా - అత‌డు చెప్పిన క‌థ‌పైనా పూర్తి న‌మ్మ‌కం వుంద‌ని - ఆ న‌మ్మ‌కంతోనే భారీ బ‌డ్జెట్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాన‌ని నాని అంటున్నార‌ట‌. ఆ మేర‌కు అత్యంత‌ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకులు అందాయి.