Begin typing your search above and press return to search.

అమెరికాలో అక్కడే ఆగిన నాని

By:  Tupaki Desk   |   1 Oct 2018 2:30 PM GMT
అమెరికాలో అక్కడే ఆగిన నాని
X
లోకల్ మార్కెట్ వేరు.. ఓవర్సీస్ మార్కెట్ వేరు. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమా అక్కడ సూపర్ హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు. ఓవర్సీస్ లో కంటెంట్ ఉంటే తప్ప సినిమాలకు కలెక్షన్స్ రావు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా ఓపెనింగ్ డే కలెక్షన్స్ బాగున్నా.. టాక్ అటూ ఇటూ అయితే నెక్స్ట్ డే నుండి కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి.

అలాంటి జోన్ లోన్యాచురల్ స్టార్ నాని కి మంచి ఫాలోయింగ్ ఉంది. నాని కి దాదాపు ఐదు వన్ మిలియన్ డాలర్ ఫిలిమ్స్ ఉన్నాయి. సహజంగా ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు హీరోలు స్లో గా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తారు.. కానీ న్యాచురల్ స్టార్ మాత్రం వన్ మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరే ఆగిపోతున్నాడు. నాని సినిమాలు వన్ మిలియన్ డాలర్ దాటి పెర్ఫామ్ చేయడం దాదాపు గగనమైపోయింది. ఇక నాని కొత్త సినిమా 'దేవదాస్' సంగతే తీసుకుంటే దాని పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. నాగార్జున తో కలిసి చేసిన మల్టిస్టారర్ అయినప్పటికీ ఇంకా వన్ మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయలేకపోయింది.

అమెరికాలో ఇప్పటి వరకూ 'దేవదాస్' షుమారు $650k కలెక్షన్స్ సాధించింది. బుధవారం: $162405 గురువారం: $87980 శుక్రవారం: $135838 శనివారం : $175298 ఆదివారం: $90k ఫస్ట్ వీకెండ్ టోటల్: $650k (షుమారుగా). చూస్తుంటే ఇది కూడా వన్ మిలియన్ డాలర్ కు అటు ఇటుగా ఆగేలా ఉంది. ఇక నాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి సర్ ప్రైజ్ చేస్తే తప్ప.. అమెరికాలో నాని బండి మళ్ళీ ముందుకు కదిలేలా లేదు.