Begin typing your search above and press return to search.
మూడు రోజుల్లో ముప్పావు మిలియన్
By: Tupaki Desk | 7 Feb 2017 9:17 AM GMTఅమెరికాలో హాఫ్ మిలియన్ మార్కు అన్నది నానికి మంచి నీళ్ల ప్రాయం అయిపోయింది. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి అతడి ప్రతి సినిమా ఆ మార్కును దాటుతోంది. ఐతే నాని గత మూడు సినిమాలు అర మిలియన్ మార్కును దాటాయి కానీ.. మిలియన్ మార్కును మాత్రం అందుకోలేకపోయాయి. దీంతో ‘భలే భలే మగాడివోయ్’ అమెరికాలో 1.5 మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లడం గాలివాటమే అన్న అభిప్రాయం బలపడింది. కానీ నాని లేటెస్ట్ మూవీ ‘నేను లోకల్’ అమెరికాలో నాని బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది. కేవలం ఫస్ట్ వీకెండ్లోనే ఈ చిత్రం ముప్పావు మిలియన్ మార్కుకు చేరువ కావడం విశేషం.
ప్రిమియర్లతో కలుపుకుని అమెరికాలో మూడు రోజుల్లోనే 7.45 లక్షల డాలర్లు కొల్లగొట్టింది ‘నేను లోకల్’. గురువారం ప్రిమియర్లతో 1.65 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం శుక్రవారం, తొలి రోజు 1.92 లక్షల డాలర్లు ఖాతాలో వేసుకుంది. శనివారం ఏకంగా 2.85 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఆదివారం లక్ష డాలర్లకు పైగా వసూలు చేసి ముప్పావు మిలియన్ మార్కుకు చేరువైంది. ఇక ఈ చిత్రం మిలియన్ మార్కును అందుకోవడం లాంఛనమే కావచ్చు. వీక్ డేస్‌లో కూడా ‘నేను లోకల్’ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఎస్-3, ఓం నమో వెంకటేశాయలతో పోటీ ఉన్నప్పటికీ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి వసూళ్లు బాగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇక తొలి వీకెండ్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల షేర్.. రూ.24 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/