Begin typing your search above and press return to search.
నానీ.. ఏంటీ అరాచకం?
By: Tupaki Desk | 5 Feb 2017 7:58 PM GMTనేచురల్ స్టార్ జోరు మామూలుగా లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో నాని సినిమా ‘నేను లోకల్’ దుమ్ము దులిపేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య నిర్ణయాల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఎన్నారైలు సినిమాలు ఏం చూస్తారులే అని సందేహించారు కానీ.. ‘నేను లోకల్’ మీద ఆ ప్రభావమేమీ కనిపించలేదు. నాని గత సినిమాలన్నింటి కంటే దీనికి భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. పెద్ద స్టార్ హీరోల స్థాయిలో వసూళ్లు కుమ్మేస్తున్నాడు నాని. కేవలం గురువారం ప్రిమియర్లతోనే 1.66 లక్షల డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రం శుక్రవారం 1.936 లక్షలు డాలర్లు ఖాతాలో వేసుకుంది. శనివారం అంతకంటే మిన్నగా 2.83 లక్షల డాలర్లు వసూలయ్యాయి. అంటే రెండో రోజుకే ఈ చిత్రం 6.433 (రూ.4.32 కోట్లు) లక్షల డాలర్లు వసూలు చేసి హాఫ్ మిలియన్ మార్కును అలవోకగా దాటేసింది.
ఆదివారం వసూళ్లు కూడా కలుపుకుంటే 8 లక్షల డాలర్ల మార్కును దాటేస్తుందన్నమాటే. ఈ ఊపు చూస్తుంటే ‘నేను లోకల్’ సునాయాసంగానే మిలియన్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని సినిమాలూ మూడూ అమెరికాలో మంచి వసూళ్లే సాధించాయి కానీ.. మిలియన్ క్లబ్బులోకి చేరలేకపోయాయి. దీంతో అక్కడ ‘భలే భలే..’ హిట్ గాలివాటం అన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీని కంటే ముందు ‘ఈగ’ సినిమాతోనూ నాని అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బును అందుకున్నాడు. కానీ దాని క్రెడిట్ అంతే రాజమౌళికే వెళ్లిపోయింది. ‘భలే భలే..’ ఫ్లూక్ హిట్ అన్నారు కాబట్టి ‘నేను లోకల్’ విజయం మాత్రం పూర్తిగా నాని క్రెడిట్లోకి వస్తుందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.7.54 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. ‘నేను లోకల్’ ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశముంది.