Begin typing your search above and press return to search.

ఐదు రోజుల్లో 20 కోట్లు.. ఇదీ అతడి స్టామినా

By:  Tupaki Desk   |   8 Feb 2017 10:18 AM GMT
ఐదు రోజుల్లో 20 కోట్లు.. ఇదీ అతడి స్టామినా
X
నాని సినిమా ఎలా ఉన్నా ఓ 15 కోట్లు గ్యారెంటీగా వెనక్కి వచ్చేస్తుందని భరోసా వచ్చేసింది ట్రేడ్ వర్గాల్లో. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇక కలెక్షన్ల మోతేనని ‘నేను లోకల్’ రుజువు చేస్తోంది. పెద్ద హీరోల సినిమాల స్థాయిలో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల మార్కుకు ‘నేను లోకల్’ చేరువ కావడం విశేషం. మంగళవారం నాటికి ఈ చిత్రం రూ.19 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఈ రోజు మార్నింగ్ షో వసూళ్లను కలుపుకుంటే ‘నేను లోకల్’ రూ.20 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లే. ఫస్ట్ వీకెండ్లో హౌస్ ఫుల్స్ తో ఆడిన ‘నేను లోకల్’ సోమవారం కూడా స్టడీగా నడుస్తోంది.

వీక్ డేస్ లో సైతం ఫస్ట్ షోకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మిగతా షోలకు కూడా దాదాపుగా హాళ్లు నిండిపోతున్నాయి. రూ.22 కోట్ల షేర్ సాధిస్తే ‘నేను లోకల్’ బ్రేక్ ఈవెన్ కు వచ్చేసినట్లే. తొలి వారం పూర్తయ్యేసరికే ఈ చిత్రం లాభాల బాట పట్టడం ఖాయమని తెలుస్తోంది. రెండో వీకెండ్లో కూడా సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉండటంతో బయ్యర్లకు మంచి లాభాలు గ్యారెంటీనే. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.30 కోట్ల షేర్ సాధించి.. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ను అందుకునే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. కాకపోతే ఈ వారాంతంలో ‘ఎస్-3’తో పాటు ‘ఓం నమో వెంకటేశాయ’ రిలీజవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై పాజిటివ్ బజ్ ఉంది. వాటి వల్ల ‘నేను లోకల్’ వసూళ్లపై ప్రభావం పడుతుంది కానీ.. వాటితో పోలిస్తే ఇది భిన్నమైన సినిమా.. పైగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కాబట్టి మరీ కలెక్షన్లు పడిపోయే పరిస్థితి అయితే ఉండదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/