Begin typing your search above and press return to search.

వావ్‌.. ప‌ది రోజుల్లో 26.5 కోట్లు

By:  Tupaki Desk   |   14 Feb 2017 4:20 AM GMT
వావ్‌.. ప‌ది రోజుల్లో 26.5 కోట్లు
X
నేచుర‌ల్ స్టార్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. ఈ వారం రెండు కొత్త సినిమాలు రిలీజైనా.. ఆ రెంటికీ మంచి టాక్ వ‌చ్చినా.. నాని సినిమా ‘నేను లోక‌ల్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. వారం రోజుల్లోనే రూ.20 కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేసిన నేను లోక‌ల్‌.. రెండో వారంలో కూడా స‌త్తా చాటింది. మొత్తం ప‌ది రోజుల్లో రూ.26.5 కోట్ల షేర్ తో అంచ‌నాల్ని మించిపోయింది. ఈ వీకెండ్ అయ్యేస‌రికి ఈ చిత్రం రూ.30 కోట్ల మార్కును అందుకుని నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రూ.30 కోట్లకు పైగా షేర్ క‌లెక్ట్ చేసింది. అమెరికాలో ఈ సినిమా మిలియ‌న్ మార్కుకు అత్యంత చేరువ‌గా ఉంది.

ప‌ది రోజుల్లో ఏరియాల వారీగా ‘నేను లోక‌ల్‌’ షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం (తెలంగాణ)- రూ.8.42 కోట్లు

సీడెడ్‌ (రాయలసీమ)-రూ.2.64 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.3.02 కోట్లు

గుంటూరు-రూ.1.56 కోట్లు

కృష్ణా-రూ.1.58 కోట్లు

తూర్పు గోదావరి-రూ.1.89 కోట్లు

పశ్చిమ గోదావరి-రూ.1.18 కోట్లు

నెల్లూరు-రూ.61 ల‌క్ష‌లు

ఏపీ-తెలంగాణ‌లో క‌లిపి- రూ.20.9 కోట్లు

యుఎస్‌-2.88 కోట్లు

క‌ర్ణాట‌క- రూ.1.77 కోట్లు

మిగ‌తా ఏరియాల‌న్నీ క‌లిపి- రూ.95 ల‌క్ష‌లు

మొత్తం-రూ.26.5 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/