Begin typing your search above and press return to search.

నాని మళ్లీ కొట్టబోతున్నాడు..

By:  Tupaki Desk   |   5 Feb 2017 6:03 AM GMT
నాని మళ్లీ కొట్టబోతున్నాడు..
X
అప్పట్లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమాను అమెరికాలో 110 స్క్రీన్లలో రిలీజ్ చేస్తుంటే చాలామంది సెటైర్లు వేశారు. ఖర్చులు కూడా వెనక్కి రావంటూ ఎద్దేవా చేశారు. కానీ ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుందో తెలిసింది. చాలామంది స్టార్ల సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నాని నటించిన మూడు సినిమాలూ అమెరికాలో మంచి వసూళ్లే రాబట్టాయి కానీ.. మిలియన్ క్లబ్బును మాత్రం అందుకోలేకపోయాయి. ఐతే నేచురల్ స్టార్ లేటెస్ట్ మూవీ ‘నేను లోకల్’ మాత్రం అతణ్ని మళ్లీ మిలియన్ డాలర్ హీరోను చేసేలా ఉంది.

ఈ శుక్రవారం విడుదలైన ‘నేను లోకల్’ గురువారం ప్రిమియర్లతోనే ఏకంగా 1.62 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. శుక్రవారం కూడా ఈ సినిమా జోరు మామూలుగా లేదు. ఏకంగా 1.9 లక్షల డాలర్లు వసూలు చేసింది. అంటే తొలి రోజు ముగిసేసరికే ప్రిమియర్లతో కలిపి 3.5 లక్షల డాలర్లకు పైగా వసూలైపోయాయి. శనివారం వసూళ్ల వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ.. ఈపాటికే ఈ సినిమా హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ అయ్యేసరికే 6-7 లక్షల డాలర్ల మధ్య వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. కాబట్టి ‘నేను లోకల్’ మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చే వీకెండ్లో రానున్న ‘సింగం-3’ మాస్ సినిమా. ‘ఓం నమో వెంకటేశాయ’ ఆధ్యాత్మిక చిత్రం. వీటితో పోలిస్తే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన ‘నేను లోకల్’ మీదే యుఎస్ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశముంది. వాటి ప్రభావం ఉండదని కాదు కానీ.. రెండో వీకెండ్లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చే అవకాశమైతే ఉంది. కాబట్టి ఈగ.. భలే భలే మగాడివోయ్ తర్వాత మళ్లీ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టబోతున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/