Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో నాని కౌంట్ ఇదీ..

By:  Tupaki Desk   |   5 Feb 2017 10:45 AM GMT
రెండు రోజుల్లో నాని కౌంట్ ఇదీ..
X
నాని లేటెస్ట్ మూవీ ‘నేను లోకల్’ అంచనాల్ని మించిపోయింది. ఒక స్టార్ హీరో సినిమా తరహాలో వసూళ్లు రాబట్టింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.8 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచిన ‘నేను లోకల్’ రెండో రోజు కూడా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.3.13 కోట్ల షేర్ సాధించింది. మొత్తం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.7.54 కోట్ల షేర్ తెచ్చుకుంది. మూడో రోజు ఆదివారం కావడంతో షేర్ రూ.11 కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ రూ.15 కోట్లను దాటుతుందని అంచనా. నైజాం ఏరియాలో మాత్రమే రెండు రోజుల షేర్ రూ.3 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. అమెరికాలో ఆల్రెడీ ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును దాటేసి దూసుకెళ్తోంది.

తొలి రెండు రోజుల్లో ‘నేను లోకల్’ ఏరియాల వారీగా ఎంత షేర్ వసూలు చేసిందంటే..

నైజాం-2.92 కోట్లు

సీడెడ్-రూ.99.5 లక్షలు

నెల్లూరు- రూ.24.2 లక్షలు

గుంటూరు- రూ.62.2 లక్షలు

కృష్ణా- రూ.53.4 లక్షలు

తూర్పు గోదావరి- రూ.81 లక్షలు

పశ్చిమ గోదావరి- రూ.46.5 లక్షలు

ఉత్తరాంధ్ర- రూ.95 లక్షలు

మొత్తం ఏపీ-తెలంగాణ రెండు రోజుల షేర్- రూ.7.54 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/