Begin typing your search above and press return to search.

'నేను లోకల్' అంటున్న నేచురల్ స్టార్

By:  Tupaki Desk   |   30 Jun 2016 9:35 AM GMT
నేను లోకల్ అంటున్న నేచురల్ స్టార్
X
నేచురల్ యాక్టర్ కం యాక్టర్ నాని కొత్త ప్రాజెక్టుల విషయంలో భలే ట్యాలెంట్ చూపిస్తున్నాడు. వరుసగా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. థ్రిల్లర్ మూవీ జెంటిల్మన్ తర్వాత నాని చేస్తున్న సినిమాకు మజ్ను అనే టైటిల్ డిసైడ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చాలావరకూ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మరో కొత్త సినిమాకి నాని సైన్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో నాని నెక్ట్స్ సినిమా చేయనుండగా.. సినిమా చూపిస్త మామా డైరెక్టర్ త్రినాథ్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి 'నేను లోకల్' అనే టైటిల్ ని సెట్ చేయనున్నారని అంటున్నారు. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్టెయినర్ కావడం విశేషం. అందుకే దీనికి 'నేను లోకల్' అనే టైటిల్ మాస్ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇడియట్ సినిమాలో రవితేజ చెప్పిన 'చంటిగాడు లోకల్' డైలాగ్ ఈ టైటిల్ కి స్ఫూర్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

'నేను లోకల్' మూవీలో నేను..శైలజ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈమె రోల్ కూడా మాస్ కి దగ్గరగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సెప్టెంట్ లేదా అక్టోబర్ నుంచి నేను లోకల్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.