Begin typing your search above and press return to search.
నాని సినిమా.. మరీ ఆ స్థాయిలోనా?
By: Tupaki Desk | 1 July 2017 8:44 AM GMTతెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో సైతం నాని ఫాలోయింగ్ బాగా పెరిగింది గత రెండేళ్లలో. ఒకప్పుడు నాని సినిమా ఓవరాల్ కలెక్షన్లే ఐదారు కోట్లకు మించేది కాదు. కానీ రెండేళ్లుగా నాని సినిమాలు ఒక్క అమెరికాలో మాత్రమే మిలియన్ డాలర్లకు అటు ఇటుగా వసూలు చేస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల దాకా కొల్లగొడితే.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా మిలియన్ డాలర్ వసూళ్లకు చేరువగా వెళ్లాయి. నాని లాస్ట్ మూవీ ‘నేను లోకల్’ కూడా అక్కడ అదరగొట్టింది. ఈ ఊపులో నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ని అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో దీనికి జులై 6న ఏకంగా 500 ప్రిమియర్ షోలు వేయబోతుండటం సంచలనం రేపుతోంది.
దాదాపు 140-150 లొకేషన్లలో ‘నిన్ను కోరి’ని రిలీజ్ చేస్తారట. అమెరికాలో ఈ స్థాయి రిలీజ్ తెలుగులో ఓ అరడజను హీరోలకు మాత్రమే ఉంటుంది. చాలామంది స్టార్ హీరోల కంటే కూడా నాని అమెరికాలో ఎక్కువ వసూళ్లు రాబడుతూ.. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు సంపాదించాడు. అతడి సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా హాఫ్ మిలియన్ డాలర్లు గ్యారెంటీ. వారం కిందట వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ది అమెరికాలో ఆరంభ శూరత్వమే అయింది. ప్రిమియర్లతో పాటు తొలి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత డల్ అయిపోయింది. మిలియన్ మార్కును అందుకోవడమే కష్టమైంది. ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే 2 మిలియన్ మార్కును టచ్ చేయాలి. అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఐతే నాని సినిమాకు భారీ స్థాయిలో ప్రిమియర్లు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ‘డీజే’ వసూళ్లను ఇది దాటేస్తుందేమో అన్న అంచనాలున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్లోనే మిలియన్ మార్కును టచ్ చేయొచ్చు. ‘నిన్ను కోరి’ తెలుగు ఎన్నారైల టేస్టుకు తగ్గ క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైననర్ లాగా కనిపిస్తుండటం కలిసొచ్చే అంశం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/