Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: నిన్ను కోరి.. ఫీల్ గుడ్ స్టోరి
By: Tupaki Desk | 17 Jun 2017 9:43 AM GMTవరుసగా ప్రేమకథలను చేసుకుంటూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించుకుంటూ పోతున్న హీరో నాని.. ఇప్పుడు మరోసారి ఒక న్యాచురల్ ప్రేమకథతో వచ్చేశాడు. ఈసారి ''నిన్నుకోరి'' అంటూ ఒక కొత్త దర్శకుడి డైరక్షన్లో కనిపించాడు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పదండి ఎలా ఉందో చూద్దాం.
వైజాగ్ లో ఒక ప్రేమకథ. నాని అండ్ నివేథా థామస్ అక్కడ ప్రేమించుకుంటారు. కట్ చేస్తే.. అది హమ్ ఆప్కే హై కౌన్ అవుతుంది అనుకుంటే.. ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్లిపోయింది. లవ్ లో సెకండ్ ఛాన్సు ఉండదు అనుకునే హీరోయిన్.. నీ సంతోషమే ముఖ్యం అనుకునే సెకండ్ హీరో.. తనతోనే చావో బ్రతుకో అనుకున్న నాని.. ఈ ముగ్గురి ముక్కోణపు కథే ఇప్పుడు ''నిన్ను కోరి'' అంటూ నూతన దర్శకుడు శివ నిర్వణా తీసింది. నాని ఎప్పటిలాగానే సేమ్ లుక్కులో అదే తరహా డైలాగ్ డెలివరీలో మెప్పించాడు. ఇక నివేదా థామస్ అండ్ ఆది పినిశెట్టి కూడా అదే తరహాలో ఉన్నారు. గోపి సుందర్ అందించిన మ్యూజిక్.. అలాగే సినిమాటోగ్రాఫీ బాగున్నాయి. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకు అవే ముఖ్యం.
ఒక ప్రక్కన చూస్తుంటే ఈ నిన్నుకోరి సినిమా అప్పుడెప్పుడో మణిరత్నం తీసిన సినిమాలను తలపిస్తోంది. ఒక భర్త తన భార్యను ఆమె తొలి లవ్వర్ కు తిరిగి ఇచ్చేయడం అనే కాన్సెప్టు తరహాలో ఉంది. కథా కథనంలో ట్రైలర్ వరకు పెద్దగా ఆసక్తికరమైన ఎలిమెంట్స్ లేవు కాని.. సినిమాలో ఏమున్నాయో చూడాలి.