Begin typing your search above and press return to search.

అల్లు క్యాంప్‌ ఎక్కడ చేస్తుందిలే

By:  Tupaki Desk   |   30 Sep 2015 4:19 AM GMT
అల్లు క్యాంప్‌ ఎక్కడ చేస్తుందిలే
X
గతంలో భలే భలే మగాడివోయి సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు.. ఆ సినిమాలో హీరోగా చేస్తున్న నాని తో నిర్మాత అల్లు అరవింద్‌ మరో సినిమాను చేస్తున్నారని ఒక టాక్‌ వచ్చింది. కాకపోతే ఆ తరువాత ఆ టాక్‌ ఎక్కడా వినిపించలేదు. ఇపుడు అసలు ఈ కాంబినేషన్‌ మళ్ళీ రాకపోవచ్చు అంటున్నారు. ఎందుకలా?

మారుతి డైరక్షన్‌ లో వచ్చిన భలే భలే మగాడివోయి హిట్టయ్యాక నాని అమాంతం తన రెమ్యూనరేషన్‌ ను 1.25 లక్షల నుండి షుమారు 3 కోట్లు చేసేశాడు కాబట్టి.. ఇక మనం నాని తో కష్టం అని అల్లు క్యాంప్‌ డిసైడైనట్లు ఒక టాక్‌. అసలు మనం ఊహించుకుంటాం కాని.. ఇంతవరకు తాము హిట్టు కొట్టాక అసలు గీతా ఆర్ట్స్‌ వారు ఏ హీరోను మళ్ళీ రిపీట్‌ చేశారు..? 100% లవ్‌ తరువాత నాగ చైతన్యతో సినిమా తీశారా లేకపోతే మగధీర తరువాత చరణ్‌ తో తీశారా? పోనివ్‌ గజనీ తరువాత అమీర్‌ తో తీశారా లేకపోతే ఇప్పుడు నానితో తీస్తారా?

మనోళ్లు హీరోయన్లను మాత్రం తమ స్నేహితుల క్యాంపుల్లో రిపీట్‌ చేస్తున్నారు కాని.. హీరోలకు మాత్రం రిపీట్‌ చాన్సులు ఇవ్వట్లేదుగా.. అందుకే చెప్పేది.. అసలు అల్లు క్యాంపు నానితో ఎక్కడ చేస్తుందిలే అని...