Begin typing your search above and press return to search.

శివ నిర్వానతో చేయడం ఇష్టం లేక నో చెప్పాలనుకున్నాః నాని

By:  Tupaki Desk   |   20 April 2021 5:30 AM GMT
శివ నిర్వానతో చేయడం ఇష్టం లేక నో చెప్పాలనుకున్నాః నాని
X
నాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌ లో ది బెస్ట్‌ చిత్రాల జాబితాలో నిన్ను కోరి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. నవ్వించడంతో పాటు ఏడిపించడం కూడా తెలిసిన నాని ఆ సినిమాతో అన్ని భావోద్వేగాలను పండించాడు. శివ నిర్వాన దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి సినిమా ఒక విభిన్నమైన ప్రేమ కథా చిత్రం గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అలాంటి సూపర్‌ హిట్ ను అందించిన శివ నిర్వాన కథ చెప్పేందుకు కలుస్తానంటే మొహమాటం కొద్ది ఓకే చెప్పానని.. ఎలాంటి ప్రేమ కథ చెప్పినా కూడా ఖచ్చితంగా నో చెప్పాలని ముందే ఫిక్స్ అయ్యాను. కాని టక్ జగదీష్ సినిమా స్టోరీ చెప్పిన వెంటనే మరో మాట మాట్లాడలేక పోయి ఓకే చెప్పాను అన్నాడు.

శివ నిర్వాన లవ్ స్టోరీ తీసుకు వస్తాడేమో అని నాని భావించాడట. లవ్‌ స్టోరీ లపై ఆసక్తి లేని నాని ముందే కథకు నో చెప్పాలని ఫిక్స్‌ అయ్యాడు. కొత్త కథ ఏదైనా చేయాలని ఆశిస్తున్న సమయంలో శివ నిర్వాన టక్ జగదీష్‌ కథ తీసుకు రావడం జరిగిందని తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నాయి. ఈ నెలల విడుదల చేయాలని భావించి కరోనా వల్ల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు కుదుట పడ్డ వెంటనే టక్ జగదీష్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా నాని ప్రకటించాడు.

టక్‌ జగదీష్‌ ఒక ఫ్యామిలీ సబ్జెట్‌ అని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోల బట్టి అర్థం అవుతోంది. నాని జగదీష్‌ గా ఖచ్చితంగా మరో గుర్తుండి పోయే పాత్రను చేశాడంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. టక్ జగదీష్‌ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఆ సినిమాకు ఇప్పటికే మంచి బిజినెస్ కూడా అయ్యింది. కాని కరోనా మొత్తం ప్లాన్ ను తలకిందులు చేసింది. నాని ఈ సినిమా ప్రమోషన్ కోసం పలు టీవీ షోలకు హాజరు అవ్వడంతో పాటు పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ ప్రమోషన్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. సినిమా విడుదలకు కనీసం రెండు నెలల సమయం అయినా పట్టే అవకాశం ఉంది. కనుక మళ్లీ ప్రమోషన్‌ ను మొదటి నుండి మొదలు పెట్టాల్సి రావచ్చు అంటున్నారు.